కరోనాకు చెక్... భారత్‌లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం... ఎలా పనిచేస్తుందంటే..

కరోనాకి ముందు భారత దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు అది రోజురోజుకూ విస్తరిస్తోంది. సరికొత్త రూపు సంతరించుకుంటోంది.

news18-telugu
Updated: July 1, 2020, 12:59 PM IST
కరోనాకు చెక్... భారత్‌లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం... ఎలా పనిచేస్తుందంటే..
కరోనాకు చెక్... భారత్‌లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం... ఎలా పనిచేస్తుందంటే.. (File)
  • Share this:
ఇండియాలో తొలి ప్లాస్మా బ్యాంకును గుజరాత్... అహ్మదాబాద్‌లోని... మయూర్ మకాడియాలో ప్రారంభించారు. జూన్ 24 నుంచి ఇది సేవలు అందిస్తోంది. సివిల్ హాస్పిటల్ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రికి దీని సేవలు అందుతున్నాయి. రక్తదానం ఎలాగో... ప్లాస్మా దానం అలాగ. ఈ బ్యాంక్ ప్రారంభమయ్యాక... చాలా మంది కరోనా రికవరీ పేషెంట్లు... ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. సివిల్ హాస్పిటల్ డాక్టర్లు కూడా ఈ దాతల్లో ఉన్నారు. ఈ ప్లాస్మా వల్ల ఉపయోగం చాలా ఉంది. ఇందులో యాంటీ బాడీస్ ఉంటాయి. ఇవి కరోనా సోకిన వారితో పోరాడగలవు. అందువల్ల ఎవరి నుంచైనా ప్లాస్మా సేకరిస్తే... దాన్ని ఈ బ్యాంకులో బ్లడ్ గ్రూపుల వారీగా వేర్వేరుగా భద్రపరిచి... ఎవరికైనా కరోనా తీవ్రత పెరుగుతుంటే... వారికి ఆ ప్లాస్మాను ఎక్కిస్తారు. దాంతో వారి బాడీలో యాంటీబాడీస్ సంఖ్య పెరిగి... కరోనా వైరస్‌తో పోరాడి ప్రాణాలు నిలపగలవు.

కరోనా సోకి... కోలుకున్నవారు... ప్మాస్మా దానం చెయ్యాలని ఈ బ్యాంక్ నిర్వాహకులు కోరుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో అత్యంత బలమైన యాంటీ బాడీస్ ఉంటాయి. అవి ఇతరులకు సోకిన కరోనాను వదిలించడంలో తోడ్పడతాయి. ఐతే... ప్లాస్మాను ఎవరి నుంచి, ఎలా సేకరించాలి అనే అంశంపై భార్త వైద్య పరిశోధనా మండలి (ICMR), NBTC గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. ప్లాస్మా సేకరణకు ముందు... దాతకు యాంటీ బాడీ స్క్రీనింగ్ చేస్తారు. తద్వారా ఆ వ్యక్తిలో యాంటీ బాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటారు. ఎందుకంటే... కరోనా నుంచి కోలుకున్నవారిలో... వెంటనే యాంటీబాడీస్ తయారవ్వవు. అందుకు కొంత టైమ్ పడుతుంది. సరిపడా యాంటీబాడీస్ ఉన్న తర్వాతే... దాత నుంచి ప్లాస్మా సేకరిస్తారు.

దేశంలో మొదటి ప్లాస్మా యాంటీ బాడీస్ సేకరణ విధానాన్ని ఢిల్లీలో ప్రవేశపెట్టి... విజయం సాధించారు. దాంతో ఈ విధానానికి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కొవిడ్ ఆస్పత్రికి వచ్చి కోలుకొని ఇళ్లకు వెళ్లే వారి ఫోన్ నంబర్లను ఈ ప్లాస్మా బ్యాంక్ సేకరిస్తోంది. కొన్ని రోజుల తర్వాత వారికి కాల్ చేసి... ప్లాస్మా దానం చేయమని ఎంకరేజ్ చేస్తోంది. వెంటనే వారు వచ్చి ఆనందంగా ప్లాస్మా ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ప్లా్స్మా దానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడినవారవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యాంకు గుజరాత్, ఇతర రాష్ట్రాలకు ప్లాస్మాను సప్లై చేస్తోంది. ఇలాంటి బ్యాకుల్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తే... కరోనా నుంచి భారత్ త్వరగా బయటపడేందుకు వీలవుతుంది.

First published: July 1, 2020, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading