హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Lockdown: భారత్‌లో తక్షణం లాక్‌డౌన్ పెట్టాలి.. అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఫౌసీ

Lockdown: భారత్‌లో తక్షణం లాక్‌డౌన్ పెట్టాలి.. అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఫౌసీ

కఠినమైన లాక్‌డౌన్ విధించడంతో పాటు రానున్న రోజుల్లో అవసరాలకు తగ్గట్లు వైద్య సదుపాయాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం,  వ్యాక్సినేషన్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఫౌసీ అన్నారు.

కఠినమైన లాక్‌డౌన్ విధించడంతో పాటు రానున్న రోజుల్లో అవసరాలకు తగ్గట్లు వైద్య సదుపాయాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఫౌసీ అన్నారు.

కఠినమైన లాక్‌డౌన్ విధించడంతో పాటు రానున్న రోజుల్లో అవసరాలకు తగ్గట్లు వైద్య సదుపాయాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఫౌసీ అన్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో తక్షణమే కఠినమైన లాక్‌డౌన్‌ విధించాలని అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఎస్ ఫౌసీ సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలు, కరోనా కట్టడి గురించి ఆయన తాజాగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వార్తాసంస్థతో మాట్లాడారు. భారత్‌లో మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంతో పాటు వైరస్ ప్రభావాన్ని తగ్గించే మార్గాల గురించి ఫౌసీ వివరించారు. ప్రస్తుతం ఫౌజీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు అమెరికా అధ్యక్షులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. తాజాగా మేరీల్యాండ్‌లోని బెథెస్డాలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి శుక్రవారం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వార్తాసంస్థతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.

భారత్‌లో కోవిడ్ రెండో దశను గుర్తించడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందా లేదా అనే రాజకీయ కారణాలపై మాట్లాడటానికి ఫౌసీ నిరాకరించారు. ఒక మెడికల్ ఆఫీసర్‌ కోణంలో చూసినప్పుడు, అధికారిగా తాను చేయాల్సిన పనుల గురించి మాట్లాడతానని ఆయన చెప్పారు. వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై భారత్‌ తక్షణమే దృష్టి పెట్టాలని ఫౌసీ తెలిపారు. ఆ తరువాత కొన్ని వారాల్లో చేయగలిగే విషయాలను గుర్తించాలని సూచించారు. ఇందుకు మూడంచెల ఏర్పాట్లు అవసరమని చెప్పారు. మొదటిది కఠినమైన లాక్‌డౌన్ విధించడం. ఆ తరువాత రానున్న రోజుల్లో అవసరాలకు తగ్గట్లు వైద్య సదుపాయాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడం. ప్రణాళిక ప్రకారం వీటిని అమలు చేస్తే ఫలితం ఉంటుందని ఫౌసీ తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే...

* వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి

ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలి. ఆక్సిజన్ థెరపీ, ఆసుపత్రిలో చేరడం, వైద్య చికిత్స వంటి సమస్యలను ఇప్పటికిప్పుడు దూరం చేయలేం. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఇతరులు అనారోగ్యానికి గురికాకుండా, వైరస్‌ సోకిన వారు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా కాపాడవచ్చు. వీటి ఫలితాలు కొన్ని వారాల్లో కనిపిస్తాయి. ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు ఒక కమిషన్ లేదా ఎమర్జెన్సీ గ్రూప్ వంటివి ఏర్పాటు చేయాలి.

* వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు

గత ఏడాది కోవిడ్ సంక్షోభం ఎదురైనప్పుడు భారత్ ప్రపంచ దేశాలకు సాయం చేసింది. దీంతో ఇప్పుడు ఇతర దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. కోవిడ్ మందులు, ఆక్సిజన్ యంత్రాలు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు వంటివి సరఫరా చేస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా వైద్య మౌలిక సదుపాయాలను విస్తరించాలి. చైనాలో గత ఏడాది వైరస్ విజృంభించినప్పుడు వీలైనంత త్వరగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారత్‌ ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మిలటరీ సేవలను కూడా వాడుకోవచ్చు.

* వైరస్ వ్యాప్తి, ప్రభావం దశల వారీగా ఉంటుందా? ఇందుకు సంకేతాలు ఏమైనా ఉంటాయా?

వైరస్ ఉద్ధృతికి ముందస్తు సంకేతాల గురించి ఆలోచించడానికి బదులుగా, వైరస్ సామర్థ్యాన్ని గుర్తించడంపై దృష్టి పెట్టాలి. ఇలాంటి మహమ్మారులను నిర్లక్ష్యం చేస్తే సమాజంపై దాడి చేస్తాయి. అమెరికాలో ఇదే జరిగింది. ప్రపంచంలోనే కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోయిన దేశంగా అమెరికా నిలిచింది. అత్యంత ధనిక దేశం అయినప్పటికీ చాలా ఘోరంగా దెబ్బతినాల్సి వచ్చింది. వైరస్ ఉద్ధృతికి ధనిక, పేద దేశాలనే తేడాలు ఉండవు. మహమ్మారిని ఎదుర్కోవడానికి సరిగా సన్నద్ధం కాకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. కరోనాపై విజయం సాధించామని చాలా ముందుగా భావించడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

* అమెరికాకు చెందిన CDC ఇండియన్ వేరియంట్లను విశ్లేషిస్తుందా?

టీకాలు వివిధ వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు కొత్త రకం వైరస్‌ల జన్యుక్రమాన్ని విశ్లేషించాలి. ఇందుకు భారత్‌ వీలైనంత త్వరగా వైరస్ శాంపిల్స్‌ను అమెరికాకు చెందిన సిడిసి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలకు, బ్రిటన్‌కు చెందిన వెల్కమ్ ట్రస్టుకు పంపి వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాలి. ఈ విషయంలో సాయం చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. జినోమ్ సీక్వెన్సింగ్ ద్వారా వ్యాక్సిన్ల వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీల ప్రభావం కొత్త వేరియంట్లపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.

* భారత్‌లో టీకా ధరలు, వ్యాక్సినేషన్‌పై స్పందన?

భారత్‌లో కొన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయాలి. ధరలపై చర్చించిన తరువాత ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకొని వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. ప్రపంచంలోనే టీకా ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా భారత్‌కు గుర్తింపు ఉంది. అందువల్ల కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేయడానికి సొంత సామర్థ్యాలను పెంచుకోవాలి.

* ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి గురించి?

కొన్ని నెలల క్రితం.. భారత్‌ కంటే దారుణమైన పరిస్థితులను అమెరికా ఎదుర్కొంది. ప్రస్తుతం మా దేశంలో పరిస్థితులు కొంత వరకు కుదుటపడ్డాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ఎక్కువ మంది ప్రజలకు టీకాలు వేస్తున్నాం. ఇప్పటికే 100 మిలియన్ల మందికి పూర్తిగా టీకాలు వేశాం. దేశంలో 40 శాతం మందికి పూర్తిగా టీకాలు వేశాం. 50 శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పొందారు. వృద్ధుల వ్యాక్సినేషన్ కూడా 65 శాతం వరకు పూర్తయింది. ప్రస్తుతం హాస్పిటలైజేషన్ రేటు, మరణాల రేటు చాలావరకు తగ్గిపోయింది.

* భారత్‌కు విదేశాల సాయంపై అభిప్రాయం?

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం భారత్‌కు అండగా నిలుస్తోంది. ఇండియాలో నెలకొన్న కోవిడ్ సంక్షోభాన్ని చూసి ఇతర దేశాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. అందువల్ల ఎన్నో దేశాలు భారత్‌కు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. భారత ప్రజలకు నేను ఒక భరోసా ఇవ్వగలను. త్వరలోనే ఈ సంక్షోభం ముగుస్తుంది. మనం సాధారణ స్థితికి చేరుకుంటాం. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ ఒకరికి ఒకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజలందరూ బాధపడుతున్నప్పటికీ, సాధారణ స్థితికి వస్తామని నేను హామీ ఇస్తున్నాను.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: America, Coronavirus, Covid-19, Lock down, Lockdown, Us news

ఉత్తమ కథలు