భారత్‌లో 1000 దాటేసిన కరోనా కేసుల సంఖ్య...కేంద్రం కీలక నిర్ణయం..

ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని, 27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

news18-telugu
Updated: March 29, 2020, 11:49 PM IST
భారత్‌లో 1000 దాటేసిన కరోనా కేసుల సంఖ్య...కేంద్రం కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000 దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని, 27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ్,బీహార్ రాష్ట్రాల్లో ఒక్కో కరోనా మరణం నమోదవగా,మహారాష్ట్రలో 7,మధ్యప్రదేశ్ లో 2,కర్ణాటకలో 3,గుజరాత్ లో 4,ఢిల్లీలో2 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలోనే ఎక్కువగా కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేసుల నమోదులో కేరళ రెండవ స్థానంలో ఉంది. మూడవస్థానంలో కర్ణాటక,నాలుగవ స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading