భారత్‌లో మరో కరోనా ఇంజెక్షన్ విడుదల... ధరెంతో తెలుసా?

యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివర్‌ని జైడుస్ క్యాడిలా కంపెనీ రెమ్‌డాక్ (Remdac)బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. 100 మిల్లీగ్రాముల డ్రగ్ ధరను రూ.2800గా నిర్ణయించింది.

news18-telugu
Updated: August 13, 2020, 11:19 AM IST
భారత్‌లో మరో కరోనా ఇంజెక్షన్ విడుదల... ధరెంతో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాను తరిమికొట్టేందుకు ఎన్నో కంపెనీలు టాబ్లెట్లను, ఇంజెక్షన్‌లను విడుదల చేస్తున్నాయి. కరోనాను పూర్తి స్థాయితో తగ్గించే ప్రత్యేకమైన ఔషధం ఇప్పటి వరకు లేనప్పటికీ యాంటీ వైరల్ డ్రగ్స్ రెమిడిసివిర్, ఫావిపిరవీర్ వంటి మందులను తయారుచేస్తున్నాయి. తాజాగా భారత్‌లో మరో డ్రగ్ విడుదలైంది. యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివర్‌ని జైడుస్ క్యాడిలా కంపెనీ రెమ్‌డాక్ (Remdac)బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. 100 మిల్లీగ్రాముల డ్రగ్ ధరను రూ.2800గా నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఇంజెక్షన్ ఇస్తారు.

అమెరికా ఔషద కంపెనీ జిలీడ్ సైన్సెస్‌ రెమిడిసివీర్‌ను అభివృద్ధి చేసింది. ఆ కంపెనీతో భారత్‌కు చెందిన పలు కంపెనీలు నాన్ ఎక్స్‌క్లూజివ్ అగ్రీమెంట్ చేసుకొని తమ బ్రాండ్స్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటికే హెటిరో ల్యాబ్స్, సిప్లా, మైలాన్ ఎన్వీ, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ కూడా రెమిడిసివీర్ డ్రగ్‌ను విడుదల చేశాయి. భారత్‌లో విడుదలైన రెమిడిసివర్ డ్రగ్స్‌లో రెమడాక్ అతి చౌకనైది. అమెరికాలో విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు ఈ మందును ఇచ్చేందుకు యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 127 దేశాల్లో రెమ్డిసివిర్ ఔషధాన్ని సరఫరా చేసేందుకు ఆయా ఔషధ కంపెనీలు అంగీకారం చేసుకున్నాయి.

ఇక మనదేశంలో భారత్‌లో గడిచిన 24 గంటల్లో 66,999 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 942 మంది మరణించారు.తాజా లెక్కలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,637 కి చేరింది.ఈ లెక్కన మన దేశంలో సగటున గంటకు 2,791 మంది కరోనా బారినపడుతున్నారు. ప్రతి గంటకు 39.25 (దాదాపు 40) మంది మరణిస్తున్నారు.ఇప్పటి వరకు 16,95,982 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 6,53,622 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో బాధపడుతూ మనదేశంలో ఇప్పటి వరకు 47,033 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,30,391 కరోనా పరీక్షలు చేశారు. దాంతో మొత్తం టెస్టుల సంఖ్య 2 కోట్ల 68 లక్షల 45 వేల 688కి చేరింది.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading