Covid 19: అప్ప‌టి వ‌ర‌కు మాస్కులు ధ‌రించాలి : స్ప‌ష్టం చేసిన నీతి ఆయోగ్ స‌భ్యులు

(ప్రతీకాత్మక చిత్రం)

మాస్క్ మ‌న జీవితంలో భాగంగా మారిపోతుందా.. అస‌లు ఎన్ని రోజులు మాస్క్ ధ‌రించాలి ఇది ప్ర‌తీ వ్య‌క్తిలో క‌లిగే ప్ర‌శ్న.. దీనిపై స్పందించారు. నీతి అయోగ్ (హెల్త్) స‌భ్యుడు వీ.కె. పాల్ 2022 మాస్క్(Mask) ధ‌రించ‌క త‌ప్ప‌ద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

  • Share this:
    మాస్క్ మ‌న జీవితంలో భాగంగా మారిపోతుందా.. అస‌లు ఎన్ని రోజులు మాస్క్ ధ‌రించాలి ఇది ప్ర‌తీ వ్య‌క్తిలో క‌లిగే ప్ర‌శ్న.. దీనిపై స్పందించారు. నీతి అయోగ్ (హెల్త్) స‌భ్యుడు వీ.కె. పాల్ 2022 మాస్క్ ధ‌రించ‌క త‌ప్ప‌ద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా పోరాటం ఇంక ముగియ‌లేద‌ని ఆయ‌న అన్నారు. మూడో వేవ్(Third wave) ముప్పు తొల‌గిపోలేద‌ని ప్ర‌స్తుతం పండ‌గ‌ల నేప‌థ్యంలో దేశం స‌వాలును ఎద‌ర్కొంటుంద‌ని ఆయ‌న ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ అన్నారు.
    పండ‌గ‌ల నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మంత్తంగా ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. పెద్ద ఉత్స‌వాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇవ్వద్ద‌ని అన్నారు. కోవిడ్ (Covid19) నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి అన్నారు. సిద్దాంత ప‌రంగా ముంద‌స్తు చ‌ర్య‌లతో కోవిడ్ వ్యాప్తిని అరిక్టవ‌చ్చ‌ని వారు పేర్కొన్నారు.

    చదవండి:  NEET 2021: ప్రాణం తీసిన భయం.. నీట్‌ ప‌రీక్ష‌ఫెయిల్ అవుతానని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌




    స‌భ‌లు, ప‌ర్వ‌దినాల (Festivals) అనుమ‌తులు ఇచ్చేట‌ప్పుడు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. వైర‌స్ వ్యాప్తి ముగిసింది అనే అభిప్రాయానికి ఇప్పుడే రావొద్ద‌న్నారు.
    కేసుల న‌మోదు సంభావ్య‌త‌ల‌ను గుర్తించి వ్యాప్తి(Spread) నియంత్ర‌ణ‌కు చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. కోవిడ్ నియంత్ర‌ణ‌కు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని యూనియ‌న్ హోం సెక్ర‌ట‌రీ(Secretary) అజ‌య్ భ‌ల్లా అన్నారు. దేశంలో కోవిడ్‌19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

    దేశంలో COVID-19 పరిస్థితి
    గతంతో పోలిస్తే కోవిడ్ 19 కేసుల సంఖ్య దేశ  వ్యాప్తంగా తక్కువగానే ఉంది.  ఇది సంతోషించాల్సిన అంశమే.. కానీ రాబోయేది పండగల సీజన్ కాబట్టి కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని, జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

    కేసుల సంఖ్య :-
    - వ‌రుసగా 78 రోజుల్లో రోజు వారి కేసుల సంఖ్యం 50,000 లోపు ఉంది.
    - సెప్టెంబ‌ర్ 13న దేశంలో 27,254 కేసులు న‌మోద‌య్యాయి.
    - దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175 గా న‌మోద‌య్యాయి.
    - యాక్టీవ్ కేసుల సంఖ్య 3,74,269 గా ఉంది.

    మ‌ర‌ణాల సంఖ్య :-
    - దేశంలో కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన వారు 4,42,874మంది
    - మహారాష్ట్రలో 37,504, తమిళనాడులో 35,168, ఢిల్లీలో 25,083, ఉత్తర ప్రదేశ్‌(Uttar pradeh)లో 22,883, కేరళ(Keral)లో 22,551, పశ్చిమ బెంగాల్‌లో 18,577 మంది ప్రాణాలు కోల్పోయారు.
    - 70 శాతానికి పైగా మరణాలు సహ-రోగాల కారణంగా సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    పాజిటివిటీ రేటు :-
    - దేశంలో రోజువారి పాజిటివిట(Positivity) రేటు 2.26 శాతంగా నమోదైంది.
    - గత 14 రోజులుగా ఇది మూడు శాతం కంటే తక్కువగా ఉందని, ఇప్పుడు వరుసగా 97 రోజులు ఐదు శాతం కంటే తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
    - వీక్లీ పాజిటివిటీ రేటు 2.11 శాతంగా నమోదైంది.
    - గత 80 రోజులుగా ఈ సంఖ్య మూడు శాతం కంటే తక్కువగా ఉంది.
    Published by:Sharath Chandra
    First published: