Coronavirus: కరోనా వైరస్ ఎఫెక్ట్‌... హనీమూన్ క్యాన్సిల్

Coronavirus Effect | 60 దేశాల్లో 90,000 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 3,120 మంది చనిపోయారు. అందులో చైనా దేశస్తులే 2,934 మంది ఉన్నారు.

news18-telugu
Updated: March 5, 2020, 10:01 AM IST
Coronavirus: కరోనా వైరస్ ఎఫెక్ట్‌... హనీమూన్ క్యాన్సిల్
Coronavirus: కరోనా వైరస్ ఎఫెక్ట్‌... హనీమూన్ క్యాన్సిల్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ యువతి హనీమూన్ ట్రిప్ ఇండోనేషియాలోని బాలిలో ప్లాన్ చేసుకుంది. కానీ... కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో హనీమూన్ క్యాన్సిల్ చేసుకుంది. ఆమె మాత్రమే కాదు... ఇలా చాలామంది కొత్త జంటలు కరోనా వైరస్ ప్రభావంతో తమ హనీమూన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తోంది. భారతదేశంలో చాలామంది హనీమూన్, హాలిడే ప్లాన్స్‌ని రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమో తప్పట్లేదు. ఇందుకు కారణం కరోనా వైరస్ ప్రభావమే. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కి వెళ్లాలనుకునేవారు ముందడుగు వేయలేకపోతున్నారు. కరోనావైరస్ ప్రభావంతో టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇండోనేషియాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా లేకపోయినా అక్కడికి చైనీయుల రాకపోకలు ఎక్కువ కావడంతో బాలిలో హనీమూన్, హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నవారంతా క్యాన్సిల్ అంటున్నారు. ప్రస్తుతం ఇండోనేషియాలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

మేము బాలికి వెళ్లాలనుకున్నాం. డైరెక్ట్ ఫ్లైట్స్ దొరకలేదు. సింగపూర్ లేదా మలేషియాలో హాల్ట్ అయి వెళ్లాలనుకున్నాం. కానీ అక్కడ కరోనా వైరస్ ప్రభావం ఉంది. దీంతో మేము దుబాయి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ దుబాయిలో కూడా కరోనా వైరస్ కేసులు బయటపడటంతో ఆ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇంటర్నేషనల్ ట్రిప్ ఇప్పట్లో మంచిది కాదనిపిస్తోంది. నా హనీమూన్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మేం రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు.
హనీమూన్ ప్లాన్‌పై ఓ యువతి ఆవేదన


60 దేశాల్లో 90,000 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 3,120 మంది చనిపోయారు. అందులో చైనా దేశస్తులే 2,934 మంది ఉన్నారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో భయాందోళనలు పెరిగిపోయాయి. దీంతో టూర్లు వెళ్లాలనుకునేవారు ఇప్పట్లో మంచిది కాదనే అనుకుంటున్నారు. అందుకే తమ టూర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. లేదా వాయిదా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నవారంతా క్యాన్సిల్ చేసి స్థానికంగానే టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం టూరిజం ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.



ఇవి కూడా చదవండి:

Income Tax: మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఎంతో తెలుసుకోండి ఇలా...

IRCTC Andaman Tour: హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే 

IRCTC Golden Chariot: మార్చి 22న లగ్జరీ టూరిస్ట్ రైలు ప్రారంభం... రూట్, ప్యాకేజీ వివరాలివే
First published: March 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading