Home /News /coronavirus-latest-news /

INDIAN SCIENTISTS CLAIM TO HAVE DESIGNED VACCINE AGAINST ALL COVID VARIANTS PVN

Vaccine : అన్ని కోవిడ్ వేరియంట్లకు ఒకటే వ్యాక్సిన్..భారతీయ సైంటిస్టుల ఘనత

కోవిడ్ వ్యాక్సిన్(ప్రతీకాత్మక చిత్రం)

కోవిడ్ వ్యాక్సిన్(ప్రతీకాత్మక చిత్రం)

One Covid Vaccine For All Variants  : ఒక్కో వేరియంట్ కి కొత్త లక్షణాలు, కొత్త టీకా కోసం శాస్త్రవేత్తలు నిత్యం కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో భారత శాస్త్రవేత్తలు ప్రపంచానికి మన ఘనతను చాటారు. కరోనా వైరస్​ అన్ని వేరియంట్లకు ఒకే టీకాను అభివృద్ధి చేశారు భారత శాస్త్రవేత్తలు.

ఇంకా చదవండి ...
One Vaccine For All Covid Variants  : కరోనా వైరస్ పై పోరులో భారతీయ సైంటిస్టులు మరో అద్భుతమైన విజయం సాధించారు. ప్రాంతాన్ని,వాతావరణాన్ని బట్టి రూపు మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్ రూపంలో రెండేళ్లుగా జనాల ఆరోగ్యం మీద కరోనా వైరస్ దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో వేరియంట్ కి కొత్త లక్షణాలు, కొత్త టీకా కోసం శాస్త్రవేత్తలు నిత్యం కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో భారత శాస్త్రవేత్తలు ప్రపంచానికి మన ఘనతను చాటారు. కరోనా వైరస్​ అన్ని వేరియంట్లకు ఒకే టీకాను అభివృద్ధి చేశారు భారత శాస్త్రవేత్తలు. ఇది పెప్టైడ్‌ వ్యాక్సిన్‌.

వెస్గ్ బెంగాల్ లోని కాజీ నజ్రుల్‌ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ అభివృద్ధిపై పరిశోధన చేశారు. ఈ ప‌రిశోధ‌న‌లో కాజీ న‌జ్రూల్ యూనివ‌ర్సిటీకి చెందిన అభిగ్యాన్ చౌద‌రి, సుప్ర‌భాత్ ముఖ‌ర్జీ, ఐఐఎస్ఈఆర్ నుంచి పార్థ్ సార‌థి సేన్ గుప్తా, స‌రోజ్ కుమార్ పాండా, మ‌లాయ్ కుమార్ రాణా పాల్గొన్నారు. వారు చేసిన ప‌రిశోధ‌న మాలిక్యూల‌ర్ లిక్విడ్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురితమైంది.

ALSO READ Selfie Death : పెళ్లికని వెళ్లి పైలోకాలకు..సెల్ఫీ తీసుకుంటుండగా యువకుల్ని ఢీ కొట్టిన రైలు

వీరు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ కు 'అభిఎస్‌ సీవో వ్యాక్‌' అని పేరు పెట్టారు. ఇది కోవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు వైరస్‌ లపై సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు. తాము డిజైన్ చేసిన టీకా అత్యంత సుస్థిరంగా, యాంటిజెనిక్‌గా, ఇమ్యూనైజిక్‌గా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. కరోనా వైరస్ తో పాటు ఆ తరగతికి చెందిన ఆరు వైరస్‌ లపై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు. దీని తయారీ కోసం ఇమ్యునో ఇన్ఫర్మేటిక్‌ విధానాలను అనుసరించినట్లు తెలిపారు.

ALSO READ Weekly Salary : కొత్త శాలరీ పాలసీ వచ్చేసింది..ఇకపై వారానికోసారి జీతం

కరోనా తరగతిలోని అన్ని వైరస్‌ లను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకునే వ్యాక్సిన్  మరొకటి ప్రపంచంలో ఎక్కడా లేదని సైంటిస్టులు తెలిపారు. ఆరు భిన్న వైరస్‌ లలో స్పైక్‌ ప్రొటీన్‌లో కొన్ని భాగాలు చాలా తక్కువగా ఉత్పరివర్తనాలకు లోనవుతున్నట్లు తొలుత గుర్తించామన్నారు. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవ శరీరంలో రోగ నిరోధక స్పందనను కలిగించవచ్చని తెలిపారు. స్పైక్‌ ప్రొటీన్‌లోని ఈ భాగాలకు టీఎల్‌ఆర్‌4 అనే ప్రొటీన్‌తో బలమైన బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యం ఉందన్నారు. కరోనా వైరస్‌ను గుర్తించి, రోగ నిరోధక స్పందనను కలిగించడంలో ఈ ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. వారు చేసిన ప‌రిశోధ‌న మాలిక్యూల‌ర్ లిక్విడ్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురితమైంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Coronavirus, Covid -19 pandemic, Covid jobs, Covid vaccine, Omicron corona variant, Scientist

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు