Coronavirus : కరోనా ఎఫెక్ట్... భారత రైళ్లలో కీలక మార్పులు... వెంటనే అమలు...

Coronavirus | Indian Railways : ఎండాకాలం వస్తుండటంతో భారతీయ రైల్వే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అవి మనం తెలుసుకుంటే మంచిదే.

news18-telugu
Updated: March 17, 2020, 6:13 AM IST
Coronavirus : కరోనా ఎఫెక్ట్... భారత రైళ్లలో కీలక మార్పులు... వెంటనే అమలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Coronavirus | Indian Railways : ఎండాకాలం మొదలైంది. ఆల్రెడీ ఎండలు దంచికొడుతున్నాయి. దానికి తోడు కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ రైల్వేస్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకూ ఏసీ బోగీల్లో ఉష్ణోగ్రత 17 లేదా 18 డిగ్రీలుగా ఉంటుంటే... ఇకపై దాన్ని 25 డిగ్రీలు తగ్గకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది. తద్వారా కరోనా రాకుండా అడ్డుకోవడానికి వీలవుతుందని తెలిపింది. అలాగే ఏసీ బోగీల్లో ఉండో విండో కర్టెన్లు అన్నింటినీ తొలగిస్తున్నారు. మామూలుగా ఈ కర్టెన్లను రెండు వారాలకు ఓసారి తొలగించి, ఉతికినవి సెట్ చేస్తారు. ఐతే... కరోనా వైరస్ ఎవరికైనా ఉంటే... వాళ్లు ఆ కర్టెన్లను ముట్టుకుంటే... వాటిపై వైరస్ ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి... అసలా కర్టెన్లు అవసరమా అని డిసైడైన అధికారులు వాటిని తొలగిస్తున్నారు.

ఇకపై ఏసీ బోగీల్లో సాధారణ బెడ్‌షీట్లను ఉంచుతారు. వాటిని రోజూ మార్చి ఉతుకుతారు. అందువల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నట్లవుతుందని అధికారులు అంటున్నారు. ఐతే... ట్రైన్ వెళ్లేటప్పుడు కిటికీల సందుల్లోంచీ చల్లగాలి వస్తుంటుంది. అది నిద్ర పట్టనివ్వదు. అయినప్పటికీ... మందమైన దుప్పట్లు (బ్లాంకెట్లు) ఇకపై ఇవ్వరు. ఎందుకంటే వీటిని రోజూ ఉతకడం సాధ్యం కాదు. ఉతకనివి ఇస్తే... కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... వీటిని తొలగిస్తున్నారు. ఐతే... కొంతమంది మరీ ముసలివారు ఉంటారు. వాళ్లు దుప్పటి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారి కోసం ప్రతీ బోగీలో, రెండు మూడు దుప్పట్లు మాత్రం ఉంచాలని అధికారులు నిర్ణయించారు. వాటిని మాత్రం ప్రతి రోజూ ఉతుకుతారు.

మెట్రో రైళ్లలో ఎలాగైతే అత్యంత శుభ్రత పాటిస్తున్నారో, ఇకపై భారతీయ రైళ్లు అన్నింటిలోనూ ఇలా శుభ్రత పాటించాలని నిర్ణయించుకున్నారు. టాయిలెట్లను బాగా క్లీన్‌గా ఉంచుతారు. అలాగే చేతులు కడుక్కోవడానికి సబ్బు, లిక్విడ్ వంటివి ఉంచుతారు. హ్యాండ్ శానిటైజర్లను మాత్రం ప్రయాణికులే తెచ్చుకోవడం మేలు. ఎందుకంటే... అవి చాలా రేటు ఎక్కువ, పైగా చాలా కొరత ఉంది. అందువల్ల రైల్వే తమ వంతుగా అన్ని చర్యలూ చేపడుతున్నా... హ్యాండ్ శానిటైజర్ల విషయంలో మాత్రం ప్రయాణికులకే నిర్ణయాన్ని వదిలేసింది.
Published by: Krishna Kumar N
First published: March 17, 2020, 6:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading