రైళ్లు రద్దు చేయడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసినవారిలో ఒకటే టెన్షన్. భారతీయ రైల్వే మార్చి 31 వరకు రైళ్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్లు క్యాన్సిల్ చేయాలా వద్దా? రీఫండ్ వస్తుందా లేదా? టికెట్లు ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయా? ఇలా అనేక సందేహాలు ప్రయాణికుల్లో ఉన్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది భారతీయ రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సంస్థ అయిన ఐఆర్సీటీసీ. మీరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసినట్టైతే వాటిని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమెటిక్‌గా టికెట్లు క్యాన్సిల్ అవుతాయి. రీఫండ్ కూడా ఆటోమెటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ రీఫండ్ మీ పేమెంట్ సోర్స్లోకి వస్తుంది. ఒకవేళ రీఫండ్ రాకపోతే ఐఆర్సీటీసీ అధికారిక ప్లాట్ఫామ్లో కంప్లైంట్ చేయొచ్చు.
ఐఆర్సీటీసీలో ఇ-టికెట్ బుక్ చేసినవారికి మాత్రమే కాదు... పీఆర్ఎస్ కౌంటర్లో టికెట్లు తీసుకున్నవారికి కూడా ఊరటనిచ్చింది భారతీయ రైల్వే. టికెట్లు క్యాన్సిల్ చేయాలన్న హడావుడిలో ప్రయాణికులు రైల్వే కౌంటర్లకు రాకూడదని సూచించింది. రద్దీని తగ్గించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నందున పలు సూచనలు చేసింది రైల్వే. రీఫండ్ రూల్స్ కూడా మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం మార్చి 21 నుంచి జూన్ 21 మధ్య భారతీయ రైల్వే రద్దు చేసిన రైళ్లకు ప్రయాణ తేదీ నుంచి మూడు నెలల లోపు రీఫండ్ తీసుకోవచ్చు. అంటే మూడు నెలల లోపు రీఫండ్ కోసం ఎప్పుడైనా కౌంటర్‌కు వెళ్లొచ్చు.
ఒకవేళ భారతీయ రైల్వే రైళ్లు రద్దు చేయకపోయినా ప్రయాణికులు ప్రయాణించకపోతే మూడు నెలల్లో టికెట్ డిపాజిట్ రిసిప్ట్ మూడు నెలల్లో ఫైల్ చేయొచ్చు. సాధారణంగా ఈ నిబంధన మూడు రోజులే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మూడు నెలలకు పొడిగించింది రైల్వే. సీసీఓ లేదా సీసీఎం క్లెయిమ్ ఆఫీసుల్లో టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. ఇక 139 రైల్ సంపర్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా రైలు టికెట్లు క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులు ప్రయాణ తేదీ నుంచి మూడు నెలల్లో కౌంటర్లో రీఫండ్ పొందొచ్చు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టికెట్ కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు రైల్వే తీసుకున్న చర్యలివి.
ఇవి కూడా చదవండి:
Reliance Jio: గుడ్ న్యూస్... జియో యూజర్లకు డబుల్ డేటా
Good News: ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్
March 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 చివరి తేదీ... వివరాలివేPublished by:Santhosh Kumar S
First published:March 23, 2020, 09:11 IST