Coronavirus: ఐఆర్‌సీటీసీకి భారతీయ రైల్వే ముఖ్య గమనిక

Indian Railways | కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారతీయ రైల్వే అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీకి పలు ముఖ్యమైన సూచనలు చేసింది.

news18-telugu
Updated: March 20, 2020, 12:37 PM IST
Coronavirus: ఐఆర్‌సీటీసీకి భారతీయ రైల్వే ముఖ్య గమనిక
Coronavirus: ఐఆర్‌సీటీసీకి భారతీయ రైల్వే ముఖ్య గమనిక (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారతీయ రైల్వే 150 పైగా రైళ్లను రద్దు చేసింది. అయితే అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సినవాళ్లు రైళ్లలో వెళ్తున్నారు. అందుకే భారతీయ రైల్వే కరోనా వైరస్‌ను నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రైల్వే బోర్డు జోనల్ రైల్వేస్‌కు, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసింది. భారతీయ రైల్వే నిర్వహించే కేటరింగ్ యూనిట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసింది. ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించింది. ఆ సూచనలేంటో తెలుసుకోండి.

దగ్గు, జ్వరం, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బందిని కేటరింగ్ విధుల నుంచి దూరం పెట్టాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI నియమనిబంధనల ప్రకారం కేటరింగ్ సిబ్బంది వ్యక్తిగత శుభ్రత పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు సూపర్‌వైజర్లను నియమించాలి. కేటరింగ్ సిబ్బంది తప్పనిసరిగా గ్లోవ్స్, ఫేస్ మాస్క్‌ లాంటివి ధరించాలి. వాటిని తీసేసినప్పుడు మూత ఉన్న డస్ట్ బిన్స్‌లో వేయాలి. అందరూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, కళ్లు, ముక్కు, నోటిని తాకొద్దని, దగ్గుతున్న, తుమ్ముతున్న వారి నుంచి దూరంగా ఉండాలి. ఆహారం తయారీ, కేటరింగ్ సేవల్లో ఉన్న సిబ్బంది తమ దుస్తుల్ని రెగ్యులర్‌గా ఉతకడంతో పాటు, ఉతికిన దుస్తులతోనే విధులకు రావాలి.

క్యాంటీన్‌లోని డోర్ హ్యాండిల్స్, పీఓఎస్ మెషీన్లు, కాఫీ మెషీన్లు, బిల్లింగ్ మెషీన్లు, కౌంటర్లు, ఫ్రిజ్ హ్యాండిల్స్, టేబుల్స్, చైర్స్ లంటి వాటిని డెటాల్, లైజాల్, కొల్లిన్‌తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. కేటరింగ్ యూనిట్లలో శానిటైజర్లు, హ్యాండ్ సోప్స్ అందుబాటులో ఉంచాలి. కేటరింగ్ యూనిట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఆహార పదార్థాలను సరిగ్గా ప్యాక్ చేసి ఇవ్వాలి. ఎట్టిపరిస్థితుల్లో ప్యాకింగ్ లేకుండా ఇవ్వకూడదు. ఆహార పదార్థాలను పరిశుభ్ర వాతావరణంలోనే భద్రపర్చాలి. కేటరింగ్ యూనిట్లలోకి అనధికార వ్యక్తులను రానివ్వకూడదు.

రైల్వే కేటరింగ్ సిబ్బంది పైన చెప్పిన సూచనలు పాటించనట్టు రైల్వే ప్రయాణికులు గుర్తిస్తే వెంటనే ఇండియన్ రైల్వే హెల్ప్ లైన్, ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్స్‌పై ఫిర్యాదు చేయాలి.

ఇవి కూడా చదవండి:

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద షాక్... దెబ్బకొట్టిన కరోనా

Coronavirus Effect: మీ డబ్బుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

IRCTC: మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా? ఈ వార్నింగ్ మీకోసమే
Published by: Santhosh Kumar S
First published: March 20, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading