భారతీయ రైల్వే తన సేవల్ని క్రమక్రమంగా పునరుద్ధరిస్తోంది. ఇప్పటివరకు శ్రామిక్ రైళ్లను నడిపిన భారతీయ రైల్వే... జూన్ 1 నుంచి 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. శ్రామిక్ రైళ్లలో కాకుండా ఇతర రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఈ ప్రత్యేక రైళ్ల సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ 200 ప్రత్యేక రైళ్లు తప్ప ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్ల సేవలన్నీ రద్దు చేశామని భారతీయ రైల్వే మరోసారి ప్రకటించింది. ఈ 200 ప్రత్యేక రైల్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉండవు. కాబట్టి యూటీఎస్ టికెట్లు కూడా ఉండవు. అన్నీ రిజర్వ్‌డ్ కోచ్‌లే. ఈ రైళ్లకు ఆన్‌లైన్‌లోనే అంటే ఐఆర్‌సీటీసీలోనే రైలు టికెట్లు తీసుకోవాలి. టికెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రత్యేక రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ క్లాసెస్ ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారందరికీ సీటు లభిస్తుంది. జనరల్ కోచ్‌లలో సీటు బుక్ అయితే సెకండ్ సీటింగ్ ఛార్జీ వసూలు చేస్తుంది రైల్వే. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ గరిష్టంగా 30 రోజులు ఉంటుంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్స్ ఉండవు. రైల్వే ప్రయాణికుల టికెట్ క్యాన్సలేషన్, ఫేర్ రీఫండ్ రూల్స్-2015 నిబంధనలే ప్రత్యేక రైళ్లకూ వర్తిస్తాయి. రెగ్యులర్ రైళ్లలో ఉన్నట్టే ప్రత్యేక రైళ్లలో అన్ని కోటాలు ఉంటాయి. దివ్యాంగులకు ఇచ్చే 4 రకాల కన్సెషన్స్, పేషెంట్లు ఇచ్చే 11 రకాల కన్సెక్షన్స్ ప్రత్యేక రైళ్లలో పొందొచ్చు. రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్, 2 గంటల ముందు రెండో చార్ట్ రిలీజ్ అవుతుంది. టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులు 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి.
రైలు టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులను మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల్ని రైలు ఎక్కనివ్వరు. వారికి పూర్తి రీఫండ్ ఇస్తారు. రైలు ఎక్కే ముందు స్క్రీనింగ్ చేస్తారు. కరోనా వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైలు ఎక్కనిస్తారు. ప్రయాణికులకు రైళ్లలో దుప్పట్లు, కర్టైన్స్ అందించరు. అవసరం అనుకుంటే ప్రయాణికులే సొంత దుప్పట్లు తెచ్చుకోవాలి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు లేదా ఫేస్ కవర్స్ ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. రైళ్లలో కేటరింగ్ సేవలు ఉండవు. అందుకే ప్రయాణికులు ఆహారం, నీళ్లు తీసుకెళ్లాలి. ప్యాంట్రీ కార్ ఉన్న రైళ్లలో పరిమితంగా ఆహారపదార్థాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కొనుక్కోవచ్చు. రైల్వే స్టేషన్లలో స్టాల్స్ తెరిచే ఉంటాయి. ఫుడ్ ప్లాజాలో ఫుడ్ పార్శిల్స్ తీసుకోవచ్చు.
ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పుడు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించిన హెల్త్ ప్రోటోకాల్స్ కట్టుబడి ఉండాలి. ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Special Trains: జూన్ 1 నుంచి నడిచే 200 స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే
Special Trains: జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు... టికెట్ బుకింగ్ ఇలా
IRCTC Refund Rules: రైలు టికెట్లపై మారిన రీఫండ్ రూల్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Indian Railway, Indian Railways, Irctc, Lockdown, Railways, Train, Train tickets