HOME »NEWS »Corona vilayatandavam »indian railways clarifies not issued any protocol regarding passenger travel during post lockdown ss

Railways: రైలులో వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన రైల్వే

Railways: రైలులో వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన రైల్వే
(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | లాక్‌డౌన్ తర్వాత రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులకు భారతీయ రైల్వే కొత్త నియమ నిబంధనలు విధించనుందా? దీనిపై క్లారిటీ ఇచ్చింది రైల్వే.

  • Share this:
    లాక్‌డౌన్ తర్వాత రైలులో ప్రయాణించాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలా? ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించాలా? ఇవన్నీ పాటిస్తేనే రైలు ఎక్కనిస్తారా? కొన్ని రోజులుగా ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారతీయ రైల్వే ఇలాంటి ప్రోటోకాల్స్ పాటించనుందన్నది ఆ వార్తల సారాంశం. రైళ్లల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువ. అందుకే భారతీయ రైల్వే ఈ నియమాలను తప్పనిసరి చేయనుందని, రైలు ప్రయాణికులు మాస్కులు ధరించడంతో పాటు ఆరోగ్య సేతు యాప్‌లో హెల్త్ స్టేటస్ చెక్ చేయాలని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై భారతీయ రైల్వే క్లారిటీ ఇచ్చింది. లాక్‌డౌన్ తర్వాత ప్రయాణికులు రైలులో ప్రయాణించే విషయంలో తాము ఎలాంటి నియమనిబంధనలు వెల్లడించలేదని రైల్వే ట్విట్టర్‌లో ప్రకటించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. ఇలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే అందరికీ తప్పకుండా సమాచారం ఇస్తామని తెలిపింది.


    భారతీయ రైల్వే క్లారిటీ ఇచ్చింది కాబట్టి ప్రయాణికులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల క్రితం ఏప్రిల్ 15 నుంచి రైళ్లు ప్రయాణిస్తాయని, అందుకు సంబంధించిన రిజర్వేషన్ కూడా మొదలైందన్న వార్తలొచ్చాయి. కానీ తాము ఏప్రిల్ 15 నుంచి నడిచే రైళ్ల రిజర్వేషన్ ఆపలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

    ఇవి కూడా చదవండి:

    Indian Railways: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి రైల్వే రెడీ... తాత్కాలికంగా పలు ఉద్యోగాల భర్తీ

    Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే

    Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్
    Published by:Santhosh Kumar S
    First published:April 09, 2020, 13:34 IST

    टॉप स्टोरीज