Railway: ఆ రైలు టికెట్లన్నీ రద్దు... ప్రకటించిన రైల్వే

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. రెగ్యులర్ రైళ్లలో బుక్ చేసిన టికెట్లను రద్దు చేసినట్టు రైల్వే ప్రకటించింది. రీఫండ్ ఎలా పొందాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 24, 2020, 9:39 AM IST
Railway: ఆ రైలు టికెట్లన్నీ రద్దు... ప్రకటించిన రైల్వే
Railway: ఆ రైలు టికెట్లన్నీ రద్దు... ప్రకటించిన రైల్వే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా భారతీయ రైల్వే టైమ్ టేబుల్స్‌ని మార్చాల్సి వస్తోంది. రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే. రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్లలో ప్రయాణించేందుకు 2020 ఏప్రిల్ 14న లేదా అంతకన్నా ముందు బుక్ చేసిన రైలు టికెట్లన్నీ రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఆ ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. వీరికి గతంలో ప్రకటించిన రీఫండ్ నిబంధనలే వర్తిస్తాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మీరు 2020 ఏప్రిల్ 14న లేదా అంతకన్నా ముందు రైలు టికెట్లు బుక్ చేసినట్టైతే ఫుల్ రీఫండ్ పొందొచ్చు. మరి రీఫండ్ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మీరు పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్నట్టైతే మీ ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల లోపు ఎప్పుడైనా రీఫండ్ పొందొచ్చు. ఆ ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో టికెట్ డిపాజిట్ రిసిప్ట్-TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది. 60 రోజుల్లో చీఫ్ క్లెయిమ్ ఆఫీసర్ / సీసీఎం రీఫండ్ ఆఫీసుల్లో డీటెయిల్డ్ టీడీఆర్ ఫైల్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత రీఫండ్ లభిస్తుంది. పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు 139 రైల్ సంపర్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా రైలు టికెట్లు క్యాన్సిల్ చేయొచ్చు. ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టికెట్ల పైనా ఫుల్ రీఫండ్ వస్తుంది. మీరు ఇ-టికెట్స్ అంటే ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసినట్టైతే ఆ టికెట్లు ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. వారికి ఫుల్ రీఫండ్ లభిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది.



రైలు రద్దు కాకపోయినా ప్రయాణికులు రైలులో ప్రయాణించొద్దనుకుంటే రిజర్వ్‌డ్ ప్రయాణికులకు భారతీయ రైల్వే ఫుల్ రీఫండ్ ఇస్తుంది. పీఆర్ఎస్ కౌంటర్లలో తీసుకున్న టికెట్లతో పాటు ఇ-టికెట్స్‌కు ఇది వర్తిస్తుంది. ఇక ఇప్పటికే రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినవారికి కూడా పూర్తి రీఫండ్ వస్తుంది. అంటే క్యాన్సలేషన్ ఛార్జీలు కూడా రీఫండ్ చేస్తుంది రైల్వే. 2020 మార్చి 21 తర్వాత మీరు ఎప్పుడు రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినా మీరు పూర్తి రీఫండ్ పొందడానికి అర్హులు. మీ దగ్గర ఇప్పటికే క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేసినట్టైతే వాటి కోసం అప్లై చేయొచ్చు. పీఆర్ఎస్ కౌంటర్లలో టికెట్లు తీసుకొని క్యాన్సిల్ చేసిన ప్రయాణికులు క్యాన్సలేషన్ ఛార్జీల రీఫండ్ కోసం మీ ప్రయాణ తేదీ నుంచి 60 రోజుల్లో చీఫ్ క్లెయిమ్ ఆఫీసర్ / సీసీఎం రీఫండ్ ఆఫీసుల్లో అప్లై చేయాలి.ఇక ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్స్‌లో టికెట్లు తీసుకొని 2020 మార్చి 21 తర్వాత క్యాన్సిల్ చేసినట్టైతే వారికి క్యాన్సలేషన్ ఛార్జీలు ఆటోమెటిక్‌గా క్రెడిట్ అవుతాయి. మీరు రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు ఉపయోగించిన క్రెడిట్, డెబిట్, కార్డులు, అకౌంట్లు, వ్యాలెట్లలోకే రీఫండ్ వస్తుంది. అంటే మీరు టికెట్ బుకింగ్ సమయంలో పేటీఎం వ్యాలెట్ ఉపయోగించినట్టైతే తిరిగి పేటీఎం వ్యాలెట్‌లోకే రీఫండ్ డబ్బులు వస్తాయి. కరోనావైరస్ సంక్షోభం కారణంగా టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్‌లో ఈ మార్పులు చేసింది రైల్వే. 2020 మార్చి 21 నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పీఆర్ఎస్ కౌంటర్ జనరేటెడ్ టికెట్స్, ఇ-టికెట్స్‌కు కొత్త రీఫండ్ రూల్స్‌ అమలులో ఉంటాయి.

ఇక ఇప్పటివరకు మీ టికెట్లను మీరు క్యాన్సిల్ చేయకపోతే వాటిని రద్దు చేయకపోవడమే మంచిది. మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తించే అవకాశముంది. గతంలో ఈ సమస్య వచ్చింది. దీంతో ఆ ప్రయాణికులు మళ్లీ క్యాన్సలేషన్ ఛార్జీల రీఫండ్ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చింది. అందుకే ఐఆర్‌సీటీసీ మీ టికెట్లు క్యాన్సిల్ చేసే వరకు వెయిట్ చేయండి. ఒకేసారి లక్షలాది రైలు టికెట్లు రద్దు అయ్యాయి కాబట్టి రీఫండ్ ప్రాసెస్‌కు కాస్త సమయం తీసుకుంటుంది. రీఫండ్ రాకపోతే కంగారుపడాల్సిందేమీ లేదు. టికెట్లు క్యాన్సిల్ అయిన 4 నుంచి 7 రోజుల్లో రీఫండ్ అకౌంట్‌లో జమ అవుతుంది. రీఫండ్ విషయంలో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాన్సలేషన్ ఛార్జీలు డిడక్ట్ అయినా తిరిగి రీఫండ్ పొందొచ్చు.

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20,000 డిస్కౌంట్

 

Smartphones: చైనా బ్రాండ్లు వద్దా? అయితే మీ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

PAN-Aadhaar Link: జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఈ చిక్కులు తప్పవు
First published: June 24, 2020, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading