కార్మికులకు మే డే గిఫ్ట్.. లాక్‌డౌన్‌లో నడిచే శ్రామిక్ రైళ్లు ఇవే

ఝార్ఖండ్ కార్మికులతో లింగపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 4.30 గంటలకు ప్రత్యేక రైలు హతియాకు బయలుదేరి వెళ్లింది. 24 కోచ్‌ల ఈ రైలులో 1200 మంది కార్మికులు వెళ్లారు.

news18-telugu
Updated: May 1, 2020, 6:01 PM IST
కార్మికులకు మే డే గిఫ్ట్.. లాక్‌డౌన్‌లో నడిచే శ్రామిక్ రైళ్లు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మే డే రోజున వలస కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వలస కార్మికుల తరలించేందుకు ప్రత్యేక రైళ్లకు హోంశాఖ అనుమతించింది. ఐతే కేంద్రం నిర్ణయానికంటే ముందే పలు రాష్ట్రాల సమన్వయంతో ఆరు ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతోంది రైల్వేశాఖ. దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు శుక్రవారం నుంచి ఈ రైళ్లను నడుపుతోంది. లాక్‌డౌన్ దేశంలో మొట్ట మొదట రైలు నుంచి తెలంగాణ నుంచి ఇప్పటికే బయలు దేరింది. ఝార్ఖండ్ కార్మికులతో లింగపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 4.30 గంటలకు ప్రత్యేక రైలు హతియాకు బయలుదేరి వెళ్లింది. 24 కోచ్‌ల ఈ రైలులో 1200 మంది కార్మికులు వెళ్లారు. సాధారణంగా 72 మంది కూర్చేనే ఒక బోగీలో సామాజిక దూరం పాటిస్తూ 54 మందికే సీట్లు కేటాయించారు. ఇక ఇవాళ సాయంత్రం మరో రైలు కేరళలోని అలువా నుంచి భువనేశ్వర్‌కు వెళ్లనుంది.


రైల్వే నడిపే శ్రామిక్ రైళ్లు ఇవే:

1.లింగంపల్లి (తెలంగాణ)-హతియా (ఝార్ఖండ్)
2. నాసిక్ (మహారాష్ట్ర)-లక్నో (ఉత్తరప్రదేశ్)
3. అలువా (కేరళ)-భువనేశ్వర్ (ఒడిశా)
4. నాసిక్ (మహారాష్ట్ర)-భోపాల్ (మధ్యప్రదేశ్)
5. జైపూర్ (రాజస్థాన్)-పట్నా (బీహార్)6. కోటా (రాజస్థాన్)-హతియా (ఝార్ఖండ్)మిగిలిన రైళ్లు సైతం ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరనున్నాయి. ఇక ప్రత్యేక రైళ్లను నడిపేందుకు హోంశాఖ అనుమతివ్వడంతో రాష్ట్రాల సహకారంతో రైల్వేశాఖ మరిన్ని రైళ్లను నడపనుంది. కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగా ప్రొటోకాల్ పాటిస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయనున్నారు. రైళ్లు టికెట్లు, సామాజిక దూరం, ఇతర రక్షణ చర్యలకు సంబంధించి రైల్వేశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

ప్రయాణికులను పంపించేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. వలస కార్మికులను పంపే రాష్ట్రాలు విధిగా అందరినీ పరీక్షించాల్సి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని వారినే ప్రయాణానికి అనుమతించాలి. రాష్ట్ర ప్రభుత్వమే శానిటైజ్ చేసిన బస్సుల ద్వారా రైల్వే శాఖ సూచించిన స్టేషన్ వద్దకు ప్రయాణికుల చేరవేయాలి. బస్సుల్లో తరలించేటప్పుడు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రత్యేక రైళ్ల ప్రయాణంలో మధ్యలో ఎక్కడా స్టాప్స్ ఉండవు. పాయింట్ టు పాయింట్ మాత్రమే రైళ్లను నడుపుతారు. గమ్యస్థానం వచ్చిన తర్వాత.. సదరు స్టేషన్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచాలి. అక్కడ మరోసారి పరీక్షలు చేసిన తర్వాత బస్సుల్లో ఎక్కించాలి. కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌కు తరలించాల్సి ఉంటుంది.
Published by: Shiva Kumar Addula
First published: May 1, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading