Google: కొంతమందికి ఎప్పుడు ఎక్కడ ఏం అడగాలో తెలియదు. చదువుకున్న వాళ్లు సైతం ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు చేస్తారు. అసలు గూగుల్ సీఈఓని పాస్వర్డ్ రీసెట్ చెయ్యమని అడిగిందెవరు?
గూగుల్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఐడీలు, పాస్‌వర్డ్‌లూ మర్చిపోవడం సర్వ సాధారణం. వాటిని తిరిగి సెట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్... ఈ కరోనా కష్టకాలంలో ఇండియాకి తోడుగా ఉంటామనీ... కరోనాపై ఇండియా మరింత బలంగా పోరాడేందుకు తమ వంతు సాయం అందిస్తామని తెలిపారు. ఐతే.. తమిళనాడుకు చెందిన ఓ గూగుల్ యూజర్... తన సమస్యను ఏకంగా సుందర్ పిచాయ్కే చెప్పాలని డిసైడ్ అయ్యాడు. సోమవారం సుందర్ పిచాయ్ ఓ ట్వీట్ చేశారు. అందులో గూగుల్, దాని టీమ్స్ కలిసి... యూనిసెఫ్ (UNICEF), గివ్ఇండియా (GiveIndia) రూ.135 కోట్లు ఇస్తున్నామనీ... తద్వారా భారత్‌లో కరోనా పేషెంట్లకు మందులు, ఇతరత్రా సప్లై చెయ్యడానికి తమ వంతుగా సాయం చేస్తున్నట్లు ట్వీట్లో తెలిపారు. దేశంలో కరోనా కేసులు రోజూ 3 లక్షలకు పైగా నమోదవుతండటంతో... సుందర్ పిచాయ్ ఇలా స్పందించారు.
సుందర్ పిచాయ్ భారతీయుడే కావడం, ఆర్థిక సాయం చెయ్యడంతో... ఇండియా నుంచి ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. చాలా మంది ఆయన పెట్టిన ట్వీట్‌కి మెచ్చుకుంటూ రిప్లైలు ఇచ్చారు. ఓ యూజర్ (@Madhan67966174) మాత్రం... తాను జీమెయిల్లో లాగిన్ కాలేకపోతున్నాననీ, ఈ విషయంలో తనకు సాయం చెయ్యాలని కోరాడు. తాను పాస్వర్డ్ మర్చిపోయాననీ, దాన్ని ఎలా రీసెట్ చేసుకోవాలో తెలియట్లేదని చెప్పాడు.
Devastated to see the worsening Covid crisis in India. Google & Googlers are providing Rs 135 Crore in funding to @GiveIndia, @UNICEF for medical supplies, orgs supporting high-risk communities, and grants to help spread critical information.https://t.co/OHJ79iEzZH
అతను కావాలనే ఇలా అడిగాడో లేక అమాయకత్వంతో ఇలా అడిగాడో కానీ... ఈ క్వరీ మాత్రం ట్విట్టర్లో వైరల్ అయ్యింది. దీన్ని చదివి చాలా మంది నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు.
సుందర్ పిచాయ్... గూగుల్ బ్లాగ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో... ఇప్పటివరకూ గూగుల్‌కి చెందిన ఉద్యోగుల్లో 900 మందికి పైగా రూ.3.7 కోట్లను విరాళంగా ఇచ్చారని తెలిపారు. వివిధ దేశాల్లో కరోనాను ఎదుర్కోవడానికి ఈ డబ్బును ఆయా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చినట్లు తెలిపారు.
ఇండియాలో కరోనాపై పోరాటానికి గూగుల్, మైక్రోసాఫ్ట్తోపాటూ... ప్రపంచంలోని చాలా దేశాలు ముందుకొస్తున్నాయి. అవి వైద్య పరికరాలు, టెక్నాలజీని భారత్‌కు అందిస్తున్నాయి.
India Corona: భారత్‌లో మొన్న 3,23,144 పాజిటివ్ కేసులు రాగా నిన్న 3,60,960 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. కొత్తగా మొన్న 2,771 మంది చనిపోగా నిన్న... 3,293 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,00,187కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,61,162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,48,17,371కి చేరింది. రికవరీ రేటు 82.3 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 29,78,709 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,23,912 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 28 కోట్ల 27లక్షల 03వేల 789 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 25,56,182 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 14కోట్ల 78లక్షల 27వేల 367 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.