Good News: కేంద్ర ప్రభుత్వం వరం... కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2

Food Security Scheme | మూడు నెలల పాటు ఈ సబ్సిడీ ధరలకే బియ్యం, గోధుమలను అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దినసరి కూలీలు, ఉద్యోగాలు కోల్పోయినవారికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేలు చేయనుంది.

news18-telugu
Updated: March 25, 2020, 4:23 PM IST
Good News: కేంద్ర ప్రభుత్వం వరం... కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2
Good News: కేంద్ర ప్రభుత్వం వరం... కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2 (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ కారణంగా సంక్షోభం, దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2 కే అందించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు... మూడు నెలల పాటు ఈ సబ్సిడీ ధరలకే బియ్యం, గోధుమలను అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దినసరి కూలీలు, ఉద్యోగాలు కోల్పోయినవారికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేలు చేయనుంది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో అనేక సంస్థలు ఏప్రిల్ 21 వరకు తెరుచుకునే అవకాశం లేదు. దీంతో దినసరి కూలీలు, చిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు. కూలీ చేస్తే తప్ప పూటగడవని పేద కుటుంబాలు కోట్లల్లో ఉంటాయి. వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 80 కోట్ల మందికి నెలకు 7 కిలోల రేషన్ అందించాలని నిర్ణయించింది. రూ.27 ధర గల గోధుమల్ని రూ.2 కే అందించాలని, రూ.37 కిలో గల బియ్యాన్ని రూ.3 కే ఇవ్వాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి:

సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...

Coronavirus Effect: టీవీ, స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు చూస్తున్నారా? మీకు బ్యాడ్ న్యూస్
Published by: Santhosh Kumar S
First published: March 25, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading