Home /News /coronavirus-latest-news /

INDIAN AMERICAN LAWMAKERS DEMANDS PRESIDENT JOE BIDEN TO HELP INDIA TO FIGHT WITH CORONA SECOND WAVE HSN

Joe Biden: భారత్ నుంచి గతంలో మనం సాయం పొందాం.. ఇప్పుడు అండగా ఉందాం.. జో బైడెన్ కు అమెరికన్ ప్రముఖుల విజ్ఞప్తి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ప్రతీకాత్మక చిత్రం)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ప్రతీకాత్మక చిత్రం)

’భారత్ నుంచి గతంలో మనం సాయం పొందాం. ఏడాది క్రితం భారత్ పంపిన ఔషధాలు అమెరికన్లకు ఎంతో మంది అమెరికన్లను రక్షించాయి. ఇప్పుడు భారత్ కష్టాల్లో ఉంది. సాయం చేద్దాం‘ అంటూ జో బైడెన్ కు విన్నపాలు వస్తున్నాయి..

    ప్రపంచ దేశాలన్నిటిలోనూ కరోనా తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తోంది. గతేడాది కంటే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ కూడా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వ్యాఖ్యానించింది. భారత్ కు సాయం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. వైరి దేశాలుగా పేరొందిన పాకిస్తాన్, చైనా కూడా భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అవలంబిస్తున్న వైఖరి పట్ల ప్రపంచ దేశాలన్నీ విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కు అగ్రరాజ్య అధ్యక్షుడు జోబైడెన్ సాయం చేయడానికి చొరవ చూపకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    జనవరి 20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్ తన పాలనలో కీలక మైలు రాయి అయిన వంద రోజులను పూర్తి చేసుకున్నారు. ఎన్నో కీలక నిర్ణయాలు, చట్టాలు చేశారు. భారత సంతతి వ్యక్తులకు అనేక అత్యున్నత పదవులను ఇచ్చారు. కానీ, కరోనా కేసులతో అల్లాడిపోతున్న భారత్ కు సాయం చేయడానికి జో బైడెన్ ముందుకు రాకపోవడం పట్ల అగ్రరాజ్యంలోని ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ’కరోనా సెకండ్ వేవ్ వల్ల భారత్ తో పాటు చాలా దేశాలు తీవ్రంగా అల్లాడిపోతున్నాయి. అమెరికాలో కరోనా టీకాలు లెక్కకుమించి ఉన్నాయి. దాదాపు నాలుగు కోట్ల ఆస్ట్రెజెనెకా టీకాలు నిరుపయోగంగా గిడ్డంగుల్లో ఉండిపోయాయి. వాటిని కరోనా ప్రభావిత దేశాలకు పంపాల్సిన అవసరం ఉంది. అమెరికా వాటిని వాడటం లేదు. వాటిని అలా గిడ్డంగుల్లో ఉంచే బదులుగా ఆయా దేశాలకు విడుదల చేసి ఆపన్నహస్తం చాటాల్సిన సమయం ఇది. అధ్యక్షుడు బైడెన్ ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలి‘ అని చట్ట సభల సభ్యుడు, భారత సంతతి నేతరాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

    ’భారత్ కు సాయం చేయడానికి చైనా, పాకిస్తాన్ కూడా ముందుకు వచ్చాయి. భారత్ పట్ల అమెరికా స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. తన పాలన ద్వారా బైడెన్ సంపాదించుకున్న ఘనత ఈ వైఖరి వల్ల క్రమంగా తగ్గుతోంది‘ అని బ్రూకింగ్ ఇన్సిస్ట్యూట్ కు చెందిన తన్వీ మదన్ వ్యాఖ్యానించారు. భారత్ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయనీ, వీలయినంత త్వరగా బైడెన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భారతీయ అమెరికన్ నేత సోనాల్ షా విన్నవించుకున్నారు. భారత్ లో పరిస్థితుల వల్ల తన కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులను కోల్పోయానని ఆవేదన చెందారు. 2020వ సంవత్సరంలో అమెరికా కరోనాతో అల్లాడిపోతోంటే అత్యంత కీలకమయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి అగ్రరాజ్యానికి భారత్ సాయం చేసిందనీ, దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా భారత్ పట్ల సత్వర నిర్ణయం తీసుకోవాల్సిందిగా హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధి జెఫ్ ఎం స్మిత్ కోరారు. ఒక్క అమెరికా మాత్రమే భారత్ లో పరిస్థితులను అదుపులోకి తేగలదని అమెరికా వైద్య నిపుణులు అశిష్ ఝూ అభిప్రాయపడ్డారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: America, Corona second wave, Joe Biden, Narendra modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు