కరోనాతో అమెరికాలో భారతీయ జర్నలిస్టు మృతి...శోకసంద్రంలో కుటుంబసభ్యులు

న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే మీడియా సంస్థలో కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. బ్రహ్మ మృతిపట్ల అమెరికా మీడియా వర్గాలు సంతాపం తెలిపాయి.

news18-telugu
Updated: April 8, 2020, 12:02 AM IST
కరోనాతో అమెరికాలో భారతీయ జర్నలిస్టు మృతి...శోకసంద్రంలో కుటుంబసభ్యులు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అమెరికాలో కరోనా వైరస్‌తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు. కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే మీడియా సంస్థలో కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. బ్రహ్మ మృతిపట్ల అమెరికా మీడియా వర్గాలు సంతాపం తెలిపాయి. బ్రహ్మ కరోనా సోకిందని తెలియగానే తన నివాసంలో హోంక్యారంటైన్‌లో ఉంటున్నాడు. అతడు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడంతో స్థానిక ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటలెటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రహ్మ కన్నుమూశాడు. అంత్యక్రియల కోసం తన తండ్రి మృతదేహాన్ని ఇస్తారో లేదోనని ఆయన తనయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బ్రహ్మకు భార్య అంజన, కూతురు సుజన, కుమారుడు సుడామా ఉన్నారు.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading