Covid Cases In India : దేశంలో రోజువారీ కరోనా కేసుల(Covid Cases) సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో(సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం 8 గంటల వరకు) దేశవ్యాప్తంగా 8,813 కోవిడ్ పాజిటివ్ కేసులు,29 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు రోజు 14,917 కేసులు నమోదవగా..24 గంటల్లోనే భారీగా కేసులు తగ్గిపోయాయి.
ఇక, తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,42,77,194కి చేరగా,మొత్తం మరణాల సంఖ్య 527098కి చేరింది. గత 24 గంటల్లో మరో 15,040 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య : 4,36,38,844కి చేరింది. దేశంలో ప్రస్తుతం 1,11,252 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.
Indian Plane : అసలేం జరిగింది? అకస్మాత్తుగా పాక్ లో ల్యాండ్ అయిన హైదరాబాద్ విమానం!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, Covid cases, Covid19