హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Cases In India : భారత్ లో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు,మరణాలివే

Covid Cases In India : భారత్ లో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు,మరణాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Covid Cases In India : భారత్ లో క్రమంగా కోవిడ్ కేసులు(Covid cases in india) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6168 కోవిడ్ పాజిటివ్ కేసులు,21 మరణాలు(Covid Deaths In India) నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Cases In India : భారత్ లో క్రమంగా కోవిడ్ కేసులు(Covid cases in india) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6168 కోవిడ్ పాజిటివ్ కేసులు,21 మరణాలు(Covid Deaths In India) నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,44,42,507కి చేరగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,27,932 కి చేరుకుంది..గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 9,685 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటవరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,38,55,365కి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం 59,210 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.68 శాతానికి పెరిగిందని వెల్లడించింది. రోజువారీ రికవరీ రేటు 1.94 శాతంగా ఉందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది.

Lockdown In China : తగ్గేదే లే అంటున్న కరోనా..చైనాలో మళ్లీ లాక్ డౌన్

మరోవైపు,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గురువారం దేశవ్యాప్తంగా 22,40,162 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,12,75,23,421 కు చేరింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid cases, Covid vaccine, Covid-19

ఉత్తమ కథలు