హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : గుడ్ న్యూస్.. దేశంలో 50 వేలకు దిగువన యాక్టివ్ కోవిడ్ కేసులు

Covid Update : గుడ్ న్యూస్.. దేశంలో 50 వేలకు దిగువన యాక్టివ్ కోవిడ్ కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid Cases In India  : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Cases In India  : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి.  గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 6,093 కరోనా వైరస్ కేసులు,18 మరణాలు(Covid Deaths) నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,84,729కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,121 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 9768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,30,06,972కి చేరుకుంది.దేశంలో ప్రస్తుతం 49,636 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.70శాతంగా,మరణాలు 1.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో గురువారం ఒక్కరోజే 3,16,504 మందికి కోవిడ్ టెస్ట్ లు చేయగా..ఇప్పటివరకు దేశంలో 88,87,10,787 శాంపిల్స్ ను పరీక్షించారు. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో గురువారం 28,09,189 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 214.55 కోట్లకు చేరింది.


Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్‌ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..పాస్‌పోర్ట్,వీసా లేకుండానే ప్రపంచంలో ఎక్కడికైనా!
మరోవైపు,ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 4,94,915 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 158 7మరణాలు నమోదయ్యాయి. జపాన్​ లో అత్యధికంగా 1,26,487 కరోనా కేసులు నమోదయ్యాయి. జర్మనీ,దక్షిణ కొరియా,రష్యా,అమెరికా​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 61,24,42,097 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,12,111 మంది మరణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona casess, Corona deaths, Covid cases, Covid vaccine, COVID-19 cases

ఉత్తమ కథలు