హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : గుడ్ న్యూస్..తగ్గిపోతున్న కోవిడ్ యాక్టివ్ కేసులు

Covid Update : గుడ్ న్యూస్..తగ్గిపోతున్న కోవిడ్ యాక్టివ్ కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid cases in india :రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid cases in india :రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5383 కరోనా వైరస్ కేసులు,20మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,58,425కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,449కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,39,84,695కి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం 45,281 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.71శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో గురువారం 1491,017 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 217.26 కోట్లకు చేరింది.

ఇరాన్ వింత చట్టాలు..తండ్రి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు,అలా చేస్తే కొరడా దెబ్బలు!

మరోవైపు,ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,21,809 కోవిడ్ పాజిటివ్ కేసులు,1170 మరణాలు నమోదయ్యాయి. జపాన్​ లో అత్యధికంగా 61,478కరోనా కేసులు,120 మరణాలు నమోదయ్యాయి. రష్యాలో 53,457 కరోనా కేసులు,106 మరణాలు నమోదయ్యాయి. జర్మనీ,తైవాన్,అమెరికాలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 61,90,65,131 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,36,520మంది మరణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona cases, Corona deaths, Covid-19

ఉత్తమ కథలు