హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : కరోనా ఖతం..దేశంలో 5వేలకు దిగువన కోవిడ్ కేసులు

Covid Update : కరోనా ఖతం..దేశంలో 5వేలకు దిగువన కోవిడ్ కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid cases in india : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid cases in india : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 4912 కరోనా వైరస్ కేసులు,38మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,63,337కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,487కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,39,90,414కి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం 44,436 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.71శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో శుక్రవారం 14,76,840 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 217.41 కోట్లకు చేరింది.

రిసార్ట్ లోని రిసెప్షనిస్ట్ ని దారుణంగా హత్య చేసిన మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్!

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,02,946 కోవిడ్ పాజిటివ్ కేసులు,1189 మరణాలు నమోదయ్యాయి. జపాన్​ లో అత్యధికంగా 78.058కరోనా కేసులు,106 మరణాలు నమోదయ్యాయి. రష్యాలో 53,335 కరోనా కేసులు,104మరణాలు నమోదయ్యాయి. జర్మనీ,తైవాన్,అమెరికా,ఫ్రాన్స్,ఆస్ట్రేలియా లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసులు 61,95,78,357 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,38,727మంది మరణించారు

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona casess, Corona deaths, Covid cases, Covid19, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు