హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : కోవిడ్ కోరల నుంచి బయటపడుతున్న భారత్

Covid Update : కోవిడ్ కోరల నుంచి బయటపడుతున్న భారత్

ప్రతీకాత్మక చిత్రం)

ప్రతీకాత్మక చిత్రం)

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా4,858 కరోనా వైరస్ కేసులు,18మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,39,046కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,355కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 4735 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,39,62,664కి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం 48,027 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.71శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు 1.96శాతంగా ఉంది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో ఆదివారం 13,59,361 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,16,70,14,127 కు చేరింది.

Viral Video : అరుదైన అద్భుతం..కళ్లు ఆర్పిన హనుమంతుడు

మరోవైపు,ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 2,86,688 కోవిడ్ పాజిటివ్ కేసులు,549మరణాలు నమోదయ్యాయి. జపాన్​ లో అత్యధికంగా 69,731 కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా,రష్యా,జర్మనీ,తైవాన్ లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 61,71,79,605 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,30,741 మంది మరణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona casess, Corona deaths, Covid cases, COVID-19 cases