Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 4369 కరోనా వైరస్ కేసులు,20మరణాలు(Covid Deaths) నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,04,949కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,185 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 5178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,39,30,417కి చేరుకుంది.
దేశంలో ప్రస్తుతం 46,347 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్ గా ఉండగా, రికవరీ రేటు 98.71శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో సోమవారం 21,67,644 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య215.47కు చేరింది.
Husband Sell Wife Kidney : భార్య కిడ్నీని ఆమెకు తెలియకుండానే అమ్మి మరో పెళ్లి చేసుకున్న భర్త!
మరోవైపు,ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. కొత్తగా3,47,186కోవిడ్ పాజిటివ్ కేసులు, 835మరణాలు నమోదయ్యాయి. జపాన్ లో అత్యధికంగా 85,025 కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా,రష్యా,జర్మనీ,తైవాన్ లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 61,41,63,240 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,17,798 మంది మరణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Covid cases, Covid-19, COVID-19 vaccine