India Covid Update: దేశంలో కరోనా కేసులు(Covid Cases)క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కొత్తగా 2,706 కరోనా కేసులు,25 మరణాలు నమోదయ్యాయి. 2,070 మంది గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య4,31,55,749కి చేరింది. ఇందులో 4,26,13,440 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,24,611 మంది మరణించగా, 17,698 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొంది.
ఇక,దేశవ్యాప్తంగా ఆదివారం 2,28,823మందికి కోవిడ్ వ్యాక్సిన్ లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,31,57,352 కి చేరింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 85,00,77,409 కరోనా టెస్ట్ లు చేశామని, ఆదివారం ఒక్కరోజే 2,78,267 మందికి పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 3,27,598 మంది వైరస్ బారినపడ్డారు. మరో 552మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,15,26,656 కుచేరింది. మరణాల సంఖ్య 63,10,847కు చేరింది. ఒక్కరోజే 4,74,365 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,23,06,681గా ఉంది.
తైవాన్‌లో ఒక్కరోజే 76,605 కొత్త కేసులు, 145 నమోదయ్యయి. ఆస్ట్రేలియాలో గడిచిన 24 గంటల్లో 26,787 కోవిడ్ కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. జపాన్‌లో 24,919 కోవిడ్ కేసులు, ఫ్రాన్స్‌లో 16,440 కేసులు,ఇటలీలో 14,826 కేసులు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid -19 pandemic, Covid cases, Covid vaccine, COVID-19 vaccine