Covid Cases In India : రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటోన్న ప్రజల్ని కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. భారత్ లో నాలుగో వేవ్ అనుమానాలను బలపరుస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే పెరిగింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2451 మంది కరోనా బారినపడ్డారని,54 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1589 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని తెలిపింది. ఇక,తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,52,425కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 4,25,16,068కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,116కి చేరింది.
ఇక,ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.75 శాతం మంది కోలుకోగా, 1.21 శాతం మంది మృతిచెందారని తెలిపింది. . రోజువారీ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పైగా ఉంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ వేగంగా సాగుతోంది. గురువారం 18,03,558 మందికి కోవిడ్ వ్యాక్సిన్ లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,26,26,515కు చేరింది. మరో 4,48,939 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
ALSO READ Shocking : బాలికపై గ్యాంగ్ రేప్..ముఖాన్ని యాసిడ్ తో కాల్చి అర్థనగ్నంగా అడవిలో
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో కోవిడ్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలపై కేంద్రం దృష్టిసారించింది. త్వరలోనే రెండేళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. 2-12 ఏళ్ల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలు ఇవ్వాల్సిందిగా డీసీజీఐకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC)ప్రతిపాదనలు పంపనున్నట్లు ఓ ఉన్నతాధికారి న్యూస్18తో చెప్పారు. డీసీజీఐ ఆమోదం తెలిపిన వెంటనే.. వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకు 'బయోలాజికల్ ఈ' కంపెనీ తయారుచేసిన కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్‌ను వేయాలని డీసీజీఐకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇది వరకే ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఇక 2 ఏళ్లు నిండిన పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేయాలని త్వరలోనే ప్రతిపాదించనుంది. ప్రస్తుతం మనదేశంలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు రెండు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. 15-18 ఏళ్ల వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను వేస్తున్నారు. ప్రభుత్వ టీకా కేంద్రాలతో పాటు ప్రైవేట్ సెంటర్లలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, Covid 19 restrictions, Covid cases, Covid positive, COVID-19 vaccine