Covid Cases In India : రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటోన్న ప్రజల్ని కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. భారత్ లో నాలుగో వేవ్ అనుమానాలను బలపరుస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2380 మంది కరోనా బారిన పడగా..56 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటివీ రేటు 0.53 శాతానికి పెరిగింది బుధవారం 2067 కోవిడ్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదైన విషయం తెలిసిందే. ఇక,గడిచిన 24 గంటల్లో 1,231 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,30,49,974కు చేరగా..మరణాల సంఖ్య 5,22,062కి చేరింది. ఇప్పటివరకు 4,25,14,479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4.5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 9,04,073 కొత్త కేసులు, 3,222 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 9లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. జర్మనీలో 187,233 కొవిడ్ కేసులు,361 మరణాలు గత 24 గంటల్లో నమోదయ్యాయి. .ఫ్రాన్స్‌లో తాజాగా 155,711 మంది వైరస్ సోకగా,227 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో తాజాగా 111,280 కరోనా కేసులు నమోదవగా, 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 99,848 కొవిడ్ కేసులు, 205 మరణాలు నమోదయ్యాయి. .ఆస్ట్రేలియాలో 51,325 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి.
ఇక, భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 187.07 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.
ALSO READ Shocking : బీజేపీ నేత దారుణ హత్య..ఇంటి ముందే నాలుగు రౌండ్ల కాల్పులు
ఇక, గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతు వస్తుంది. అదే విధంగా, మరణాల సంఖ్య పెరగటం రాష్ట్రాలను ఒకింత కలవర పెడుతుంది. ఇక ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్ లు తప్పనిసరి వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా యూపీలోని యోగి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు నమోదు దృష్ట్యా, గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్పట్ మరియు లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి” అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ కూడా మాస్క్ లు తప్పనిసరి నిర్ణయం తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona cases, Corona Vaccine, Covid cases, Covid positive