Covid Cases In India : రెండున్నరేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య దేశవ్యాప్తంగా 21,566 కోవిడ్ కేసులు, 45 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 18,294 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది.
తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగాఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య : 4,38,25,185 కాగా మొత్తం మరణాల సంఖ్య 5,25,870గా ఉంది. కోలుకున్నవారి సంఖ్య: 4,31,50,434కాగా,దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1,48,881గా ఉంది.
Pork Sale Ban : భయపెడుతున్న ప్రాణాంతక వైరస్..యూపీలో పంది మాంసం అమ్మకాలపై బ్యాన్!
రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వె తెలిపింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు తెలిపింది. బుధవారం దేశవ్యాప్తంగా 29,12,855 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200.91 కోట్లు దాటింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Covid cases, Covid positive, Covid19