Home /News /coronavirus-latest-news /

INDIA REPORTS 21411 NEW CASES 67 DEATHS IN LAST 24 HOURS PVN

India Covid 19 Update : దేశంలో పెరిగిన కోవిడ్ మరణాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Covid 19 Update : రెండున్నరేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Corona Virus)..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

India Covid 19 Update : రెండున్నరేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Corona Virus)..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గగా..మరణాల సంఖ్య పెరిగింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య దేశవ్యాప్తంగా 21,411 కోవిడ్ కేసులు, 67 మరణాలు(Covid Deaths)నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే శుక్రవారంతో పోల్చితే మరణాల సంఖ్య కొద్దిగా పెరిగింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 60 మరణాలు(Covid Deaths)నమోదైన విషయం తెలిసిందే.

ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి పెరిగినట్లు తెలిపింది. గత 24 గంటల్లో 20,726 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. మరో 4,80,202 మందికి కరోనా పరీక్షలు చేశారు.



PM Modi : ఆ తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి

తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగాఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,38,68,476 కాగా మొత్తం మరణాల సంఖ్య 5,25,997గా ఉంది. కోలుకున్నవారి సంఖ్య 4,31,92,379 కాగా,దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1,50,100గా ఉంది. దేశంలో శుక్రవారం 34,93,209 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ని అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 201.68 కోట్లు దాటింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona deaths, Covid -19 pandemic, Covid cases, Covid vaccine, COVID-19 cases

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు