హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

India Covid Update : భారీగా పెరిగిన కరోనా కేసులు

India Covid Update : భారీగా పెరిగిన కరోనా కేసులు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Covid Cases In India : రెండున్నరేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Corona Virus)..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

Covid Cases In India : రెండున్నరేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Corona Virus)..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు(Covid Cases) మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య 20,409 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా,47 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్​ నుంచి 22,697 మంది కోలుకున్నారు. 3,98,761 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,39,79,730కి చేరగా,మరణాల సంఖ్య 5,26,258కి చేరింది. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,43,988 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు,దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 203.60 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 38,63,960 మందికి టీకాలు అందించినట్లు తెలిపింది.

Daily Rashi Phalalu : నేటి రాశి ఫలం : ఈ రాశుల వారికి ఆర్థికంగా పురోగతి..మంచి యోగం పట్టే కాలం

మరోవైపు,ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 9,26,447 మంది కోవిడ్ వైరస్​ బారినపడగా.. 2,028 కరోనా మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 57,93,87,454..మరణాల సంఖ్య 64,14,119కి చేరింది. ఒక్కరోజే 8,50,731 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య54,93,36,123కు చేరింది.

First published:

Tags: Coron cases, COVID-19 cases