Covid Cases In India : దేశంలో ఉన్నట్టుండి కరోనా కేసులు(Corona cases)భారీగా పెరిగాయి. గడిచిన 100 రోజుల్లో లేని విధంగా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు(Covid Cases)గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు 17,336 కోవిడ్ పాజిటివ్ కేసులు(Covid Positive Cases), 13 మరణాలు నమోదయ్యాయని, కరోనా బారి నుంచి 13,029 మంది కోలుకున్నారని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు నమోదయ్యాయి. కేరళలో 3890, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక,పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య : 43,362,294కి చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 5,24,954కి చేరింది. కోలుకున్నవారి సంఖ్య 4,27,49,056కి చేరింది. 88,284 కేసులు దేశంలో యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉంది.
ఇక, దేశంలో ఇప్పటివరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గురువారం ఒక్కరోజే 13,71,107 మందికి టీకాలు అందించినట్లు తెలిపింది.
Draupadi Murmu : ఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము..నేడు రాష్ట్రపతి పదవికి నామినేషన్!
మరోవైపు,తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలి. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona alert, Covid cases, Covid positive