India Covid Cases : దేశంలో రోజువారీ కరోనా కేసుల(Covid Cases) సంఖ్య స్థిరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,917 మందికి కరోనా వైరస్(Corona Virus) సోకినట్లు, 32 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,42,68,381కి చేరగా,తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 5,27,069కి చేరుకుంది.
గత 24 గంటల్లో 14,238 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు మొత్తంగా 4,36,23,804 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,17,508 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. భారత్‌లో ఆదివారం 25,50,276 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,08,25,13,831కు చేరింది.
Independence Day 2022 : తగ్గేదే లే..ఎర్రకోటపై మోదీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే
రోజువారీ పాజిటివిటీ రేటు 7.52 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతంగా ఉందని, మరణాలు 1.19 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Covid -19 pandemic, Covid cases, Covid positive