Home /News /coronavirus-latest-news /

INDIA REPORTS 1150 NEW CASES AND 4 DEATHS IN 24 HOURS PVN

Covid Cases : దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Covid Cases :  దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. 12,56,533 మందికి శనివారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,51,53,593కు చేరింది.

ఇంకా చదవండి ...
Covid Cases :  దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 1,150 కొవిడ్ కేసులు,నాలుగు మరణాలు నమోదయ్యాయని ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్నటికంటే 17 శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది. శనివారం 975 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక,తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,42,097కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,21,751కి చేరుకుంది. 4,25,08,788 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 11,558 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. కాగా, మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉన్నదని, 1.21 శాతం మంది మరణించారని కేంద్రం వెల్లడించింది,

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. 12,56,533 మందికి శనివారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,51,53,593కు చేరింది. కొత్తగా 3,65,118 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 83,18,43,406 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 5,56,924 కొత్త కేసులు, 1,593 మరణాలు నమోదయ్యాయి. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దక్షిణ కొరియాలో తాజాగా 1,07,882 కరోనా కేసులు, 273 మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో 46,073 కొవిడ్​ కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో 63,815 కొవిడ్ కేసులు నమోదవగా..133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో 41,209 కరోనా కేసులు,35 మరణాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్​​ లో 1,11,583 మంది వైరస్​ సోకగా.. 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona cases, Covid cases, Covid vaccine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు