INDIA REPORTS 1054 COVID NEW CASES AND 29 DEATHS PVN
Covid Cases : కరోనా కోరల నుంచి బయటపడుతున్న భారత్..కొత్తగా 1054 కేసులు
ప్రతీకాత్మక చిత్రం
Covid Cases In India : కరోనా కోరల నుంచి భారత్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో 1054 కొత్త కరోనా కేసులు నమోదవగా, 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Covid Cases In India : కరోనా కోరల నుంచి భారత్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో 1054 కొత్త కరోనా కేసులు నమోదవగా, 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శనివారంతో పోలిస్తే మరణాల సంఖ్య తగ్గింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది.
గత 24 గంటల్లో 1258 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 4,30,35,271కి చేరాయి. ఇందులో 4,25,02,454 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. 5,21,685 మంది మృతిచెందారు. 11,132 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 79,38,47,740 కరోనా పరీక్షలు చేశారు.
మరోవైపు,దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ల సంఖ్య 185.70 కోట్లకు చేరింది. ఇందులో శనివారం ఒక్కరోజే 14,38,792 మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా 8,18,784 కొత్త కేసులు నమోదవగా.. 2,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
మరోవైపు,దేశంలో కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి సంచలన ప్రకటన వెలువడింది. ఇండియావ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి బూస్టర్ డోసుల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా రెండు ప్రధాన తయారీదారులు టీకాల ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆస్పత్రులకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర (ఒక డోసుకు) రూ.600 నుంచి రూ.225 అయింది. అలాగే, కొవాగ్జిన్ ధర(ఒక డోసు) రూ.1200 నుంచి రూ.225కు తగ్గింది. ఈ మేరకు సీరం ఇనిస్టిట్యూట్ ఈసీవో అధర్ పూనావాలా, భారత్ బయోటెక్ అధినేత్రి సుచిత్రా ఎల్లా శనివారం ఒకే సమయంలో వేర్వేరుగా ప్రకటనలు చేశారు. అయితే, గతానికి భిన్నంగా బూస్టర్ డోసుల పంపిణీని కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోని టీకా కేంద్రాల్లో మాత్రమే అందించనున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందించే టీకా కేంద్రాల్లో బూస్టర్ డోసుల పంపిణీపై ఇంకా నిర్ణయం జరగలేదు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.