హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid19 : కరోనా కోరల నుంచి బయటపడుతున్న భారత్..కొత్త కేసులు ఎన్నంటే..

Covid19 : కరోనా కోరల నుంచి బయటపడుతున్న భారత్..కొత్త కేసులు ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం)

ప్రతీకాత్మక చిత్రం)

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases) రోజురోజుకు తగ్గిపోతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases) రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5910 కరోనా వైరస్ కేసులు,16 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,62,445కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,007 కు చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 7,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,38,80,464కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 53,974 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ 2.60 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో ఆదివారం 32,31,895 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.52 కోట్లకు చేరింది.

OMG : రక్తసిక్తమైన కెనడా : సడెన్ గా వచ్చి కత్తులతో దాడులు..భారీగా మృతులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 618,970 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 2,125 మరణాలు నమోదయ్యాయి. జపాన్​ లో అత్యధికంగా 1,17,130 కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా,రష్యా,అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 601,189,435 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,475,346 మంది మరణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid cases, Covid vaccine, Covid-19

ఉత్తమ కథలు