హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : గుడ్ న్యూస్..తగ్గిపోతున్న కోవిడ్ కేసులు,మరణాలు

Covid Update : గుడ్ న్యూస్..తగ్గిపోతున్న కోవిడ్ కేసులు,మరణాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5221 కరోనా వైరస్ కేసులు,15మరణాలు(Covid Deaths) నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 44,505,801కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,165 కు చేరింది.  గడిచిన 24 గంటల్లో దేశంలో 5975 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,39,25,239కి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం 47,176 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.71శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో ఆదివారం 30,76,305 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,15,26,13,049కు చేరింది.

మరోవైపు,ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 288,472 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 627మరణాలు నమోదయ్యాయి. జపాన్​ లో అత్యధికంగా 89,911 కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా,రష్యాలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 61,34,01,483 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,16,287 మంది మరణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona casess, Covid cases, Covid vaccine, COVID-19 cases

ఉత్తమ కథలు