భారత్‌లో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు...

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

  • Share this:
    భారత్‌లో 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 103 మంది మరణించారు. అలాగే, 24 గంటల్లో 1273 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 16,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. 37916 మంది యాక్టివ్ కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో కరోనా నుంచి కోలుకునే వారి శాతం 29.36గా ఉందని తెలిపారు. మొత్తం చనిపోయిన వారు 1886 కాగా, దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,342గా నమోదైంది.

    దేశంలోని 216 జిల్లాల్లో కరోనా కేసులు రాలేదని తెలిపారు. అలాగే, 42 జిల్లాల్లో గత 28 రోజులుగా ఎలాంటి కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని లవ్ అగర్వాల ప్రకటించారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 5231 రైల్వే కోచ్‌లను కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చింది. దేశంలోని 215 గుర్తించిన రైల్వే స్టేషన్లలో ఈ కరోనా ట్రీట్‌మెంట్ కోచ్‌లను ఉంచుతారు. కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించి, వారికి తక్కువ స్థాయిలో ప్రమాదం ఉందనుకున్న వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: