దేశంలో గంటకు వెయ్యి కరోనా కేసులు... 24 గంటల్లో 613 మరణాలు... ఎటు పోతున్నాం?

భారత్‌లో కరోనా అత్యంత దారుణంగా ఉందనేందుకు ఈ రోజువారీ లెక్కలే చెబుతున్నాయి. ఇప్పట్లో కరోనా తగ్గదా? కరోనా రాకుండా ఏం చెయ్యాలి?

news18-telugu
Updated: July 5, 2020, 10:29 AM IST
దేశంలో గంటకు వెయ్యి కరోనా కేసులు... 24 గంటల్లో 613 మరణాలు... ఎటు పోతున్నాం?
దేశంలో గంటకు వెయ్యి కరోనా కేసులు... 24 గంటల్లో 613 మరణాలు... ఎటు పోతున్నాం? (credit - NIAID)
  • Share this:
దేశంలో రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతీ గంటకూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 24850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 673165కి పెరిగింది. అలాగే... 24 గంటల్లో 613 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 19268కి పెరిగింది. దేశంలో ఒకే రోజు అత్యధిక మరణాలు, అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇది 8 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో భారత్ 4వ స్థానంలో ఉంది.

ఇక 24 గంటల్లో 14856 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసుల సంఖ్య 409082కి పెరిగింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 244814గా ఉంది. గత 24 గంటల్లో 248934 మందికి టెస్టులు చేశారు. అందువల్ల మొత్తం టెస్టుల సంఖ్య 9789066కి పెరిగింది.

ఇక చెప్పుకోతగ్గ విషయమేంటంటే... రికవరీల సంఖ్య 4 లక్షలు దాటడం ఒకింత ఉపశమన అంశం. కాకపోతే... ఇప్పుడు రోజువారీ 25వేల కేసుల దాకా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం.

మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షలు దాటేసి... 200064కి చేరింది. ఢిల్లీలో మాత్రం రోజువారీ నమోదవుతున్న కేసుల కంటే... డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా రికవరీలు 2632 అయితే... కొత్త కేసులు 2505గా ఉన్నాయి. ఫలితంగా ఢిల్లీలో రికవరీ రేటు 70 శాతాన్ని దాటింది. ఇండియాలో అది 60.8గా ఉంది.

తెలంగాణలో యాక్టివ్ కేసులు 10వేలు దాటి... 10487కి చేరాయి. మొత్తం కేసులు 22312గా నమోదయ్యాయి. నిన్న కొత్తగా 1850 కేసులు నమోదయ్యాయి.

ఇవాళ ఇండియా మొత్తం కేసుల్లో రష్యాని వెనక్కి నెట్టి... మూడోస్థానంలోకి చేరేలా ఉంది. ఎందుకంటే... రెండు దేశాల మధ్య తేడా వెయ్యి కంటే తక్కువే ఉంది.

ఇండియాలో కరోనా కేసుల వివరాలు
ప్రపంచంలో కరోనా కేసుల వివరాలు
Published by: Krishna Kumar N
First published: July 5, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading