కరోనా కేసుల్లో స్పెయిన్‌ను దాటిన భారత్.. ప్రపంచంలో టాప్ 5 ప్లేస్..

కరోనా వైరస్ కేసుల్లో భారత్ స్పెయిన్‌ను దాటిపోయింది.

news18-telugu
Updated: June 6, 2020, 10:33 PM IST
కరోనా కేసుల్లో స్పెయిన్‌ను దాటిన భారత్.. ప్రపంచంలో టాప్ 5 ప్లేస్..
కరోనా వైరస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో రెండు లక్షణాలను జోడించింది.
  • Share this:
కరోనా వైరస్ కేసుల్లో భారత్ స్పెయిన్‌ను దాటిపోయింది. ఆ రకంగా ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఐరోపాలో కరోనా కేంద్రబిందువుగా ఉన్న స్పెయిన్‌లో 2,40,978 కరోనా వైరస్ కేసులు ఉండగా, భారత్ ఆ నెంబర్‌ను దాటింది. ఇండియాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 2,44,000కు చేరుకుంది. గత వారం రోజుల నుంచి భారత్‌లో రోజుకు కనీసం 9వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కొత్త రికార్డు సెట్ చేస్తోంది కరోనా. భారత్‌లో అత్యధిక కేసులు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీల్లో నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదువుతున్నాయి. ఏపీలో ఈరోజు 210 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఇక తెలంగాణలో 206 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
First published: June 6, 2020, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading