హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron : పెరుగుతోన్న ఒమిక్రాన్ వ్యాప్తి -గుజరాత్‌లో మరో 2 కొత్త కేసులు.. దేశంలో 145

Omicron : పెరుగుతోన్న ఒమిక్రాన్ వ్యాప్తి -గుజరాత్‌లో మరో 2 కొత్త కేసులు.. దేశంలో 145

భారత్ లో ఒమిక్రాన్ కేసులు

భారత్ లో ఒమిక్రాన్ కేసులు

తాజాగా గుజరాత్ లో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటిదాకా దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కుపెరిగింది. ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్ నుంచి గుజరాత్ వచ్చిన ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారిని అహ్మదాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో భారీ ప్రాణనష్టాన్ని కలిగించిన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఉధృతంగా వ్యాపిస్తోంది. యూరప్ దేశాలన్నీ దాదాపు లాక్ డౌన్ దిశగా వెళుతుండగా, భారత్ లోనూ రోజురోజుకూ వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా గుజరాత్ లో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటిదాకా దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కుపెరిగింది. ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్ నుంచి గుజరాత్ వచ్చిన ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారిని అహ్మదాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. లక్షణాలేవీ లేకుండానే వారు ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తాజా కేసులతో కలిపి గుజరాత్ లో మొత్తం ఒమిక్రాన్ కేసులు 9కి పెరిగాయి. మహారాష్ట్రలో 48 కేసులు, ఢిల్లీ 22, తెలంగాణ 20, రాజస్థాన్ 17, కర్ణాటక 14, కేరళ 11, ఏపీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, చండీగఢ్ లో ఒక్కోకేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తంగా దేశంలోని 11 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.

Viral Video : పీట‌ల మీదే పెళ్లి కూతురును లాగి.. మండపంలో కొత్త జంట దూకుడు.. వీడియో వైరల్ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 89 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డెట్లా వేరియంట్ కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే వ్యాప్తి ఉధృతంగా ఉందన్నారు. కాగా, రోగ నిరోధక శక్తిపై ఒమిక్రాన్ వేరియంట్ ఏమేరకు ప్రభావం చూపుతుందనేదానిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని, ఒమిక్రాన్ తీవ్రతపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Pushpa.. ఇంత దారుణమా? -భార్యాభర్తలు చెరోవైపు చేరి బాలికను నగ్నంగా పడుకోబెట్టి.. ఏళ్లపాటు..ఒమిక్రాన్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలోని ఏడు దేశాల ప్ర‌జ‌లు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించ‌డంతోనే దీన్ని అడ్డుకోవ‌చ్చున‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఈశాన్య ఆసియా డైరెక్ట‌ర్ పూనం ఖేత్ర‌పాల్‌సింగ్ చెప్పారు. వైర‌స్ రిస్క్ ఎక్కువ‌గా ఉన్న వారిని కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

First published:

Tags: Covid, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు