Covid Cases In India : కరోనా కోరల నుంచి భారత్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల్లో(Covid Cases In India) గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.
Covid Cases In India : కరోనా కోరల నుంచి భారత్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల్లో(Covid Cases In India) గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 19 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 946 మంది కోలుకున్నట్లు మంగథవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే సోమవారంతో పోల్చితే కేసులు తగ్గినప్పటికీ మరణాలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం దేశంలో 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. ఇక,ఇక,తాజా కేసులో కలిసి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,30,36,968కి చేరుకోగా,మొత్తం మరణాల సంఖ్య 5,21,710కి చేరుకుంది. 4,25,04,329 మంది ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,889 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉండగా, డైలీ పాజిటివిటీ 0.20 శాతంగా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.
మరోవైపు,దేశంలో వ్యాక్సినేషన్(Covid Vaccination In India) కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 185.90 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 15,65,507 మందికి సోమవారం టీకాలు అందించారు. ఇప్పటివరకు మొత్తం 79,45,25,202 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 545,832 కొత్త కరోనా కేసులు, 2,027 మరణాలు నమోదయ్యాయి. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. జర్మనీలో 92,639 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో 90,928 కరోనా కేసులు నమోదవగా, 258 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్లో తాజాగా 47,876 మంది వైరస్ సోకగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 28,368 కొవిడ్ కేసులు నమోదవగా.. 115 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో 42,726 కరోనా కేసులు, ఐదు మరణాలు గడిచిన 4 గంటల్లో నమోదయ్యాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.