హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : హమ్మయ్యా..దేశంలో భారీగా తగ్గిపోయిన కోవిడ్ కేసులు

Covid Update : హమ్మయ్యా..దేశంలో భారీగా తగ్గిపోయిన కోవిడ్ కేసులు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus) పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases) రోజురోజుకు తగ్గిపోతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus) పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases) రోజురోజుకు తగ్గిపోతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 4,417 కరోనా వైరస్ కేసులు,23 మరణాలు(Covid Deaths) నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,66,862కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,030 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,38,86,496కి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం 52,336 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ 1.20 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో సోమవారం ఒక్కరోజే 19,93,670 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.72 కోట్లకు చేరింది.

సోషల్ మీడియాలో చూసి..మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం,చివరికి ఏమైందంటే

మరోవైపు,ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 3,50,984 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 1013 మరణాలు నమోదయ్యాయి. జపాన్​ లో అత్యధికంగా 105,010 కరోనా కేసులు నమోదయ్యాయి. జర్మనీ,దక్షిణ కొరియా,రష్యా,అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 610,613,899 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,504,852 మంది మరణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona deaths, Covid cases, COVID-19 vaccine, Covid19, Vaccination

ఉత్తమ కథలు