COVID 19 cases : దేశంలో కరోనా కేసులు(Covid Cases)తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 2338 కొత్త కేసులు,19 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య మొత్తం 5,24,630కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2134 మంది బాధితులు వైరస్ కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,26,15,574కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 17,883 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు, దేశంలో కరోనా టీకాల పంపిణీ మొదలై 500 పూర్తవుతోంది. దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మరో 13,33,064 మందికి వ్యాక్సిన్ లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,45,19,805కు చేరింది.
ఇక,ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగానే పెరిగాయి. అన్నిదేశాల్లో కలిపి గడిచిన 24 గంటల్లో 3,39,294 కేసులు వెలుగుచూశాయి. 828 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో తాజాగా 26,604 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో 10 మంది మృతిచెందారు.బ్రెజిల్లో కొత్తగా 24,082 కేసులు నమోదయ్యాయి. మరో 72 మంది చనిపోయారు. జర్మనీలో 23,406 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా, 87మంది వైరస్‌కు బలయ్యారు.క,కరోనావైరస్ ఉద్ధృతి ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలో కొత్తగా 1,00,710 కేసులు నమోదయ్యాయి. మరొక్కరు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,549,590కి చేరింది. మరణాల సంఖ్య 70గా ఉంది.
ALSO READ Man fight to get Rs 35 refund : రూ.35 కోసం రైల్వేతో పోరాడి..3 లక్షల మందికి లబ్ది చేకూర్చిన ఇంజినీర్
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,19,50,272కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 63,11,801గా ఉంది. వైరస్ బారినపడినవారిలో 50,28,89,582 మంది కోలుకున్నారు. ఇక,కరోనావైరస్ ఉద్ధృతి ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలో కొత్తగా 1,00,710 కేసులు నమోదయ్యాయి. మరొక్కరు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,549,590కి చేరింది. మరణాల సంఖ్య 70గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona deaths, Covid cases, Covid vaccine, North Korea