లాక్‌డౌన్ కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మరి మీరు ఏవైనా బిల్లులు చెల్లించాల్సి ఉందా? ఈరోజుల్లో ఏ పేమెంట్ అయినా ఆన్‌లైన్‌లో సులువుగా చేయొచ్చు. ఇప్పటివరకు ఆన్‌లైన్ పేమెంట్స్ సదుపాయం లేనివారు కూడా ప్రస్తుతం కరోనావైరస్ సంక్షోభంగా కారణంతో డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహిస్తుండటం విశేషం. కాబట్టి మీరు ఏవైనా బిల్లులు చెల్లించడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కాలు కదపాల్సిన అవసరం లేకుండా మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ నుంచి సులువుగా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
Digital Banking: ఎవరికైనా డబ్బులు పంపాల్సి ఉందా? ప్రతీ బ్యాంకుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ కూడా ఉంటాయి. అత్యవసరంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఈ ప్లాట్‌ఫామ్స్, యాప్స్ ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... మీ పాస్‌బుక్ అప్‌డేట్, స్టేట్‌మెంట్ లాంటి వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.
Money Transfer: యూపీఐ అకౌంట్‌తో క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. బ్యాంకులు కూడా డిజిటల్ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ని ప్రోత్సహిస్తున్నాయి. మీ బ్యాంకు యాప్స్ మాత్రమే కాదు గూగుల్‌పే, పేటీఎం లాంటి ప్లాట్‌ఫామ్స్ నుంచి సులువుగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అయితే యూపీఐ యాప్స్ వాడేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bill payment: మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించాలా? ఆన్‌లైన్‌లో సాధ్యమే. మీరు ఇన్నాళ్లూ చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నా, ఓసారి బ్యాంకును సంప్రదించి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడం మంచిది. ఇక మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్ లాంటివి కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించొచ్చు.
Insurance: మీ లైఫ్ ఇన్స్యూరెన్స్ రెన్యువల్ ప్రీమియం చెల్లించాలా? ప్రతీసారి ఆఫీసుకి వెళ్లి పేమెంట్ చేస్తున్నారా? ఆన్‌లైన్‌లో కూడా ఈ పేమెంట్ చేయొచ్చు. పేటీఎం లాంటి యాప్స్‌తో పాటు, ఆయా ఇన్స్యూరెన్స్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా రెన్యువల్ చేయొచ్చు. ఇప్పటికే రెన్యువల్ ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలను కోరింది ఐఆర్‌డీఏఐ.
Investing: ఆర్థిక సంవత్సరాన్ని 2020 జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మీరు మీ పన్ను ఆదా చేసేందుకు ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆన్‌లైన్‌లోనే స్కీమ్‌లు సెర్చ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఆన్‌లైన్‌లో సులువే. ఇందుకోసం మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ ఐడీ లాంటి కైవేసీ వివరాలన్నీ సరిగ్గా ఉంటే చాలు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కూడా ప్రారంభించొచ్చు.
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేసేవిషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇదే సమయంలో మోసగాళ్లు టార్గెట్ చేసే అవకాశముంది. ఎట్టిపరిస్థితుల్లో మీ అకౌంట్ నెంబర్లు, కార్డు నెంబర్లు, సీవీవీ, పిన్ లాంటివి వివరాలు ఎవరితో షేర్ చేయకూడదు.
ఇవి కూడా చదవండి:
SBI: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయాలా? ఈ ఫీచర్ ట్రై చేయండి
ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...
Bank Timings: లాక్‌డౌన్ ఎఫెక్ట్... టైమింగ్స్ మార్చిన బ్యాంకులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON PAY, Bank, Bank account, Banking, BHIM UPI, Corona, Corona virus, Coronavirus, Covid-19, Google pay, Investment Plans, Lockdown, MI PAY, Mobile Banking, Money, Mutual Funds, Paytm, PhonePe, UPI