హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Coronavirus Effect: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్

Coronavirus Effect: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్

Coronavirus Effect: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)

Coronavirus Effect: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

India Lockdown | మీరు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కొన్నారా? రియల్ ఇండియా రిలీజ్ చేసిన ఇతర ప్రొడక్ట్ ఏదైనా తీసుకున్నారా? కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది.

  కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. సంస్థలు, వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. పౌరులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వాలు మాత్రమే కాదు... పెద్దపెద్ద సంస్థలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో టాప్ బ్రాండ్స్‌లో ఒకటైన రియల్‌మీ తమ కస్టమర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారెంటీ పీరియడ్‌ను మే 31 వరకు పొడిగించింది. స్మార్ట్‌ఫోన్లతో పాటు అన్ని ప్రొడక్ట్స్‌కి ఇది వర్తిస్తుందని కంపెనీ ట్విట్టర్‌లో ప్రకటించింది. అంతేకాదు... ఇటీవల ప్రొడక్ట్స్ కొన్నవారికి కూడా రీప్లేస్‌మెంట్ పీరియడ్‌ను 30 రోజులు పొడిగించింది.

  ఉదాహరణకు మీ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర ప్రొడక్ట్ వారెంటీ మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 మధ్య ముగుస్తుందనుకుందాం. ఇంతలో ఆ ప్రొడక్ట్‌కి ఏదైనా సమస్య వస్తే సర్వీస్ సెంటర్‌కు వెళ్లే అవకాశం లేదు. దీంతో వారెంటీ పీరియడ్‌లో ప్రొడక్ట్‌కి సమస్య వచ్చినా వారెంటీ కవర్ చేసుకునే అవకాశం ఉండదు. కస్టమర్లు ఈ ఇబ్బందులు పడకూడదని వారందరికీ వారెంటీ పీరియడ్‌ను మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లతో పాటు వేరబుల్స్‌కి ఈ వారెంటీ వర్తిస్తుంది. కాబట్టి ఓసారి మీ రియల్‌మీ ప్రొడక్ట్ వారెంటీ ఎప్పటివరకు ఉందో చెక్ చేసుకోండి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ఉన్నట్టైతే ఆ వారెంటీ మే 31 వరకు ఉన్నట్టే. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

  ఇక మార్చి 15 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రొడక్ట్స్ కొన్నవారికి రీప్లేస్‌మెంట్ పీరియడ్‌ను 30 రోజులు పొడిగించింది. ఇక ఇండియా అంతా లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 14 వరకు రియల్‌మీ డివైజ్‌ల లాంఛింగ్ లేదని ఇప్పటికే ప్రకటించింది కంపెనీ. అందుకే రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్ వాయిదా పడింది. తయారీ యూనిట్లను తాత్కాలికంగా మూసేసింది.

  ఇవి కూడా చదవండి:

  Good News: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... మారిన రూల్స్ ఇవే

  Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు డబ్బులు లేవా? ఇలా చేయండి

  PM Gareeb Kalyan: పీఎం గరీబ్ కళ్యాణ్ స్కీమ్‌తో లాభాలు వీళ్లకే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones, Smartwatch

  ఉత్తమ కథలు