e-pass: లాక్‌డౌన్‌లో తిరగడానికి ఇ-పాస్... అప్లై చేయండి ఇలా

Lockdown e-pass | లాక్‌డౌన్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారికి ఇ-పాస్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోర్టల్ ప్రారంభించింది. ఇ-పాస్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 19, 2020, 1:33 PM IST
e-pass: లాక్‌డౌన్‌లో తిరగడానికి ఇ-పాస్... అప్లై చేయండి ఇలా
e-pass: లాక్‌డౌన్‌లో తిరగడానికి ఇ-పాస్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్‌లో అత్యవసర పనుల మీద ఎక్కడికైనా వెళ్లాలా? మీరు ఉన్న రాష్ట్రంలో వేరే ఊళ్లకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఇందుకోసం మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇ-పాస్ తీసుకోవచ్చు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఇ-పాస్ పోర్టల్స్‌ని  https://serviceonline.gov.in/epass/ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పోర్టల్‌లో మీరు ఇ-పాస్‌కు అప్లై చేయొచ్చు. మూడు లాక్‌డౌన్లలో అనేక ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో లాక్‌డౌన్‌లో ఆంక్షల్ని సడలించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్‌లో ఇ-పాస్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

e-pass: ఇ-పాస్ తీసుకోవడానికి స్టెప్స్ ఇవే



ముందుగా https://serviceonline.gov.in/epass/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో మీరు ఏ రాష్ట్రంలో ఇ-పాస్ తీసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.
ఆ తర్వాత Issuance of COVID-19 ePass పైన క్లిక్ చేయండి.
ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది.
మీ పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, వయస్సు, ఆంధ్రప్రదేశ్‌లోని అడ్రస్, ఇతర రాష్ట్రాల్లోని అడ్రస్ ఎంటర్ చేయాలి.

విద్యార్థి, అత్యవసర సేవల సహాయకులు, టూరిస్ట్, యాత్రికులు, ఎమర్జెన్సీ / మెడికల్, పెళ్లి లాంటి ఆప్షన్స్ ఉంటాయి.
ఈ ఆప్షన్లలో మీ కారణాన్ని సెలెక్ట్ చేయాలి.
మీరు అదే రాష్ట్రంలో తిరగాలా? ఆ రాష్ట్రానికి వెళ్లాలా? ఇతర రాష్ట్రానికి వెళ్లాలా? అనే ఆప్షన్స్‌ ఉంటాయి.
వాటిలో సరైన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
మీ ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేయడంతో పాటు ఇతర వివరాలన్నీ సరిగ్గా వెల్లడించాలి.
మీ దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను వెరిఫై చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇ-పాస్ జారీ చేస్తుంది.
మీరు సరైన కారణాలు, వివరాలు వెల్లడించకపోతే పాస్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

PMSBY Scheme: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు ఏడాదికి రూ.12 మాత్రమే... వివరాలివే

Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే

EPF New Rule: కొత్త ఈపీఎఫ్ నిబంధన అమలులోకి వచ్చేసింది... లాభమిదే
Published by: Santhosh Kumar S
First published: May 19, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading