HOME »NEWS »Corona vilayatandavam »india lockdown indian railways to refund rs 1490 crore to passengers for cancellation of 94 lakh tickets ss

Indian Railways: ప్రయాణికులకు రూ.1,490 కోట్లు రీఫండ్ చేయనున్న రైల్వే

Indian Railways: ప్రయాణికులకు రూ.1,490 కోట్లు రీఫండ్ చేయనున్న రైల్వే
Indian Railways: ప్రయాణికులకు రూ.1,490 కోట్లు రీఫండ్ చేయనున్న రైల్వే (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | లాక్‌డౌన్ కారణంగా భారతీయ రైల్వే రద్దు చేసిన రైలు టికెట్లు ఎన్నో తెలుసా? ప్రయాణికులకు ఎన్ని కోట్లు రీఫండ్ చేస్తుందో తెలుసా? ఆ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా భారతీయ రైల్వే మే 3 వరకు అన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 94 లక్షల టికెట్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. వీటికి మొత్తం రూ.1,490 కోట్లు రీఫండ్ చేస్తోంది రైల్వే. వీటిలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు 55 లక్షల బుకింగ్స్ ఉన్నాయి. వీటి రీఫండ్ మొత్తం రూ.830 కోట్లు. లాక్‌డౌన్ కొనసాగించడంతో ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు రైళ్లు రద్దయ్యాయి. ఈ మధ్య కాలంలో బుకింగ్స్ 39 లక్షలు. వీటి రీఫండ్ మొత్తం 660 కోట్లు. అంటే మార్చి 22 నుంచి మే 3 వరకు క్యాన్సిల్ చేసిన రూ.94 లక్షల టికెట్లపై ప్రయాణికులకు రూ.1,490 కోట్ల రీఫండ్ ఇస్తోంది. ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదని, రీఫండ్ ఆటోమెటిక్‌గా పేమెంట్ సోర్స్‌లోకి వస్తుందని తెలిపింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసినవారు జూలై 31 లోపు ఎప్పుడైనా రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

    లాక్‌డౌన్ కారణంగా రైళ్లు రద్దు చేసినందువల్ల ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ వస్తుందని రైల్వే ప్రకటించింది. కానీ రీఫండ్‌లో కన్వీనెన్స్ ఫీజు కట్ చేసి ఇస్తున్నారని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు ప్రయాణికులు. "రైలు రద్దు చేసినప్పుడు ప్రయాణికులకు మొత్తం ఫేర్ రీఫండ్‌గా వస్తుంది. కానీ టికెటింగ్ ఫెసిలిటీ రోజువారీ మెయింటనెన్స్, అప్‌గ్రేడేషన్ కోసం వసూలు చేసే కన్వీననెస్ ఫీజు రీఫండ్‌ చేయరు" అని రైల్వే ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ నాన్ ఏసీ టికెట్‌కు రూ.15, ఏసీ, ఫస్ట్ క్లాస్ టికెట్లకు రూ.30 చొప్పున కన్వీనెన్స్ ఫీజు వసూలు చేస్తోంది.



    ఇవి కూడా చదవండి:

    LIC Policy: రోజుకు రూ.28 పొదుపు... చేతికి రూ.3.97 లక్షలు... ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే

    Fixed Deposits: ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకోండి

    PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:April 17, 2020, 14:50 IST

    टॉप स्टोरीज