హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

LPG cylinder: సిలిండర్ డెలివరీపై క్లారిటీ ఇచ్చిన కంపెనీలు

LPG cylinder: సిలిండర్ డెలివరీపై క్లారిటీ ఇచ్చిన కంపెనీలు

LPG cylinder: సిలిండర్ డెలివరీపై క్లారిటీ ఇచ్చిన కంపెనీలు
(ప్రతీకాత్మక చిత్రం)

LPG cylinder: సిలిండర్ డెలివరీపై క్లారిటీ ఇచ్చిన కంపెనీలు (ప్రతీకాత్మక చిత్రం)

India Lockdown | దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎల్‌పీజీ రీటైల్, స్టోరేజ్ ఔట్‌లెట్స్‌ని లాక్‌డౌన్ నుంచి మినహాయించిందే కేంద్ర హోం శాఖ.

ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందా? దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో సిలిండర్ ఎలా తెప్పించుకోవాలో అర్థం కావట్లేదా? అసలు సిలిండర్ ఇస్తారో లేదో అన్న అనుమానాలున్నాయా? దీనిపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్లారిటీ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతున్నా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా మామూలుగానే ఉంటుందని కంపెనీలు ప్రకటించాయి. అందుకే కస్టమర్లు కంగారుపడి బుక్ చేయాల్సిన అవసరం లేదని సూచిస్తున్నాయి. ఫోన్‌లో సిలిండర్ బుక్ చేసినా ఇంటికే తెచ్చిస్తున్నాయి. ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ల సప్లై కోసం కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నామని, ఎప్పట్లాగే సిలిండర్లను డెలివరీ చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్విట్టర్‌లో వెల్లడించింది.

భారత్ పెట్రోలియం కూడా తమ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు అందుబాటులో ఉంటారని, సిలిండర్ల సరఫరా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటాన్నామని స్పష్టం చేసింది. బుక్ చేసిన కొన్ని గంటల్లోనే ఎల్‌పీజీ సిలిండర్లను ఇంటికే డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ సంక్షోభ సమయంలో నిత్యం అందుబాటులో ఉంటామని బీపీసీఎల్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎల్‌పీజీ రీటైల్, స్టోరేజ్ ఔట్‌లెట్స్‌ని లాక్‌డౌన్ నుంచి మినహాయించిందే కేంద్ర హోం శాఖ. దేశవ్యాప్తంగా అన్ని రవాణా వ్యవస్థల్ని నిషేధించినా, ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం కలగకుండా గైడ్‌లైన్స్‌ని సవరించింది. కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎల్‌పీజీ సరఫరాపై దృష్టి పెట్టారు.

ఇవి కూడా చదవండి:

PM Gareeb Kalyan: పీఎం గరీబ్ కళ్యాణ్ స్కీమ్‌తో లాభాలు వీళ్లకే

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు డబ్బులు లేవా? ఇలా చేయండి

SBI: ఖాతాదారులకు షాక్... ఆ ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ... మార్చి 31 నుంచి అమలులోకి

First published:

Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, HPCL, Indian Oil Corporation, Lockdown, LPG Cylinder

ఉత్తమ కథలు