Bank Timings: లాక్‌డౌన్ ఎఫెక్ట్... టైమింగ్స్ మార్చిన బ్యాంకులు

Bank Timings | అర్జెంటుగా ఏవైనా లావాదేవీలు జరపాలా? బ్యాంకులో ఏదైనా పనుందా? బ్యాంకుల టైమింగ్స్ మారాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 25, 2020, 5:18 PM IST
Bank Timings: లాక్‌డౌన్ ఎఫెక్ట్... టైమింగ్స్ మార్చిన బ్యాంకులు
Bank Timings: లాక్‌డౌన్ ఎఫెక్ట్... టైమింగ్స్ మార్చిన బ్యాంకులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్‌పై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 21 రోజుల లాక్‌డౌన్ దేశమంతా కొనసాగుతోంది. అనేక సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. అవకాశం ఉన్నవాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బ్యాంకులు కూడా సిబ్బందిని తగ్గించి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లాంటి ప్రభుత్వ బ్యాంకులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు కస్టమర్లతో పాటు బ్యాంకు సిబ్బంది సేఫ్టీకి మొదటి ప్రాధాన్యతనిస్తున్నాయి. సిబ్బంది తక్కువగా ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్‌ని ప్రోత్సహించడం కోసం బ్యాంకులు టైమింగ్స్‌ని మార్చాయి. మరి లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ఏఏ బ్యాంకులు ఏఏ వేళల్లో కస్టమర్లకు సేవలు అందిస్తాయో తెలుసుకోండి.

HDFC Bank timings: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శనివారం తప్ప ఇతర రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంటుంది. మార్చి 31 వరకు ఈ వేళలు ఉంటాయని బ్యాంకు ప్రకటించినా, కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో అప్పటి వరకు ఇవే వేళలు ఉండే అవకాశముంది.

Kotak Mahindra Bank timings: కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంటుంది. మార్చి 31 వరకు ఈ వేళలు ఉంటాయని బ్యాంకు ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు ఈ వేళల్ని పొడిగించే అవకాశముంది.

ICICI Bank timings: ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం తక్కువ సిబ్బందితో బ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే బ్యాంకు సేవల కోసం ఐమొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించాలని కస్టమర్లకు సూచించింది ఐసీఐసీఐ బ్యాంకు.

SBI Timings: అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా తక్కువ సిబ్బందితోనే బ్రాంచుల్ని తెరుస్తోంది. కొన్ని బ్రాంచుల్లో మాత్రం వేళల్ని తగ్గిస్తోంది. డిజిటల్ సేవల్ని ఉపయోగించుకోవాలని కస్టమర్లను కోరుతోంది ఎస్‌బీఐ.

ఇవి కూడా చదవండి:

ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

Coronavirus Effect: టీవీ, స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు చూస్తున్నారా? మీకు బ్యాడ్ న్యూస్
Published by: Santhosh Kumar S
First published: March 25, 2020, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading